IPL 2021 Schedule: ఐపీఎల్ సీజన్14 షెడ్యూల‌్ రిలీజ్..? సన్‌రైజ‌ర్స్ తొలి మ్యాచ్ ఎవ‌రితోనంటే

ఫిబ్రవరి 16న మీని వేలం జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది.

Update: 2021-01-17 13:57 GMT

ఫిబ్రవరి 16న మీని వేలం జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ వేలానికి ముందు ఫ్రాంఛైజీల అందించే జాబితాను పరిశీలించి వేలంలో పాల్గోనబోయే ఆటగాళ్ళ పూర్తి జాబితాను సిద్దం చేయనుంది బీసీసీఐ. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఈసారి భారతదేశంలోనే ఐపిఎల్ నిర్వహించాలని బిసిసిఐ ఆలోచిస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఐపిఎల్ 14వ ఎడిషన్‌ మీని వేలం ఫిబ్రవరి 11న జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికి అయితే ఆ విషయంపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది. అయితే తాజా సమాచారం 2021 ఫిబ్రవరి 16 న ఆక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేలం పాల్గోనే ఆటగాళ్ళు ఫిబ్రవరి 4 లోపు ఆన్‌లైన్ ఆప్షన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.

ఇక వేలం సంబంధించిన విషయాలను నేరుగా రాష్ట్ర సంఘాలతో మాత్రమే బీసీసీఐ చర్చించనుంది. అయితే స్టేట్ క్రికెట్ ఆసోషియన్ తరుపున ఆడుతున్న ఆటగాళ్ళతో కానీ వారి మెనేజర్‌లతో కానీ వేలం సంబంధించిన విషయాలను పంచుకొదు. వేలం పాల్గోనే ఆటగాళ్ళు సంబంధిత రాష్ట్ర క్రికెట్ సంఘాల ద్వారా మాత్రమే పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.

ఇక గత నెలలో జరిగిన బిసిసిఐ వార్షిక సమావేశంలో ఐపిఎల్ 2021 సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సీజన్లలో 8 జట్లు మాత్రమే ఆడనున్నాయని .. 2022 లో 10 జట్లను చేర్చుతున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అలాగే ఈసారి మెగా వేలం ఉండదని తెలిపింది. దీంతో ఈ ఏడాది మీని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో సమావేశం అయే ఐపిఎల్ పాలకమండలి వేలానికి సంబంధించి మరిన్ని విషయాలపై స్పష్టత ఇవ్వనుంది. అన్ని ఫ్రాంచైజీలకు వీలైనంత త్వరగా ఆటగాళ్లకు విడుదల చేయాలని సూచిచింది. జనవరి 20 నాటికి అన్ని ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల సిద్దం చేయాలని ఆదేశించింది. జట్టుల్లో ఏ ఆటగాళ్ళను రీలిజ్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫిబ్రవరి 16న మీని వేలం జరగనున్నట్లు ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఈ వేలానికి ముందు ఫ్రాంఛైజీల అందించే జాబితాను పరిశీలించి వేలంలో పాల్గోనబోయే ఆటగాళ్ళ పూర్తి జాబితాను సిద్దం చేయనుంది బీసీసీఐ. కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఈసారి భారతదేశంలోనే ఐపిఎల్ నిర్వహించాలని బిసిసిఐ ఆలోచిస్తోంది. 11 ఏప్రిల్ 2021న ఐపీఎల్ ప్రారంభంకానున్నట్లు తాజా సమాచారం. సీజన్ 14 తొలి ఆరంభ మ్యాచ్ ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబ్ తన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరుతో తలపడనంది.

Tags:    

Similar News