IPL 2021: ముంబై జట్టులో ఆ ప్లేయర్ కు నో ఛాన్స్

IPL 2021: ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.

Update: 2021-05-01 13:57 GMT

CSK vs MI File Photo

IPL 2021: ఐపీఎల్‌ సీజన్ 2021లో మరో హోరాహోరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచి ముంబై ఇండియన్స్‌ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.ముంబై ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టింది. ఇషాన్ దూరం కావడం పెద్ద దెబ్బే అయినప్పటికీ, పోలార్డ్, పాండ్యా, లాంటి హిట్లర్లు ఉండడంతో ఆ జట్టుకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.

ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతే దూకుడుగా ఆడుతూ.. చెన్నై భారీ స్కోరుకి బాటలు వేస్తున్నారు. సురేష్ రైనా, అంబటి రాయుడు ఫామ్ అందుకున్నారు. ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన ధోనీ సేన.. 5 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక..ముంబై ఇండియన్స్‌ విషయానికొస్తే.. 6 మ్యాచులాడిన రోహిత్‌ సేన.. 3 మ్యాచుల్లో గెలవగా..మరో మూడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.

తుది జట్లు:

చెన్నై సూపర్‌కింగ్స్‌: ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్‌ ఠాకూర్‌, ఎంగిడి,  చాహర్‌

ముంబై ఇండియన్స్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌పాండ్య, కృనాల్‌ పాండ్య, జిమ్మీ నీషమ్‌, రాహుల్‌ చాహర్‌, ధవళ్‌ కుల్‌కర్ణి,  బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.




Tags:    

Similar News