IPL 2020: ఆ బౌల‌ర్‌ను చూసి నేర్చుకోవాలి: యువరాజ్

IPL 2020: ఐపీఎల్ 2020 హాట్ ఫేవరేట్ బౌలర్, వేలంలో అత్య‌ధిక రూ. 15.5 కోట్ల ఖ‌రీదు ప‌లికిన‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Update: 2020-09-27 08:20 GMT

IPL 2020: Yuvraj Singh Hails Pat Cummins After Impressive Show From Pacer against Sunrisers Hyderabad

IPL 2020: ఐపీఎల్ 2020 హాట్ ఫేవరేట్ బౌలర్, వేలంలో అత్య‌ధిక రూ. 15.5 కోట్ల ఖ‌రీదు ప‌లికిన‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కమిన్స్ ఘోరంగా విఫ‌ల‌మయ్యాడు. కానీ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ వేసి, స‌న్ రైజ‌ర్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్ట‌డి చేశారు. 4 ఓవ‌ర్లు వేసి ఒక వికెట్ తీసుకుని, కేవ‌లం 19 ప‌రుగులు ఇచ్చాడు. స‌రైన స‌మ‌యంలో బెయిర్ స్టోను ఔట్ చేసి .. స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌ను ముప్పుతిప్పాలు పెట్టారు. ఆఫ్ స్టంప్, ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను టార్గెట్ చేసిన ఫలితం రాబట్టాడు.

కమిన్స్ ప్ర‌ద‌‌ర్శన‌కు యువరాజ్ ఫిదా అయ్యాడు. కమిన్స్ చూసి యువబౌలర్లు నేర్చుకోవాలని ట్విటర్ వేదికగా సూచించాడు. 'కమిన్స్ ఆట‌ తీరు అద్భుతం. తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాతి మ్యాచ్‌లో అద్బుత‌మైన బంతులు వేసి బ్యాట్‌మెన్స్ క‌ట్ట‌డి చేశారు. అత‌ని చూసి.. యువ బౌల‌ర్లు నేర్చుకోవాలని యువీ ట్వీట్ చేశాడు.

కేకేఆర్‌లో కమిన్స్‌కు తోడుగా మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.  అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శుబ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్‌), మోర్గాన్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్‌) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు.

Tags:    

Similar News