IPL 2020 Updates: ఆరంభం అదిరింది.. హోరా హోరీగా పోరు!

IPL 2020 Updates: ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ కి కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్

Update: 2020-09-19 15:08 GMT

ఆరంభం అదిరిపోయింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రతిగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి వోవర్లో చెన్నై బౌలర్లపై విరుచుకు పడింది. రోహిత్ శర్మ..డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్ మొదటి బంతికే రోహిత్ బౌండరీ చేశాడు. చహార్ వేసిన మొదటి బంతిని కవర్స్ లోకి బౌండరీగా తరలించాడు. తరువాత నాలుగో బంతిని డికాక్ బౌండరీకి తరలించాడు. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి 12 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. 

అదే ఊపును కొనసాగించిన ముంబై ఇండియన్స్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు చావ్లా. రోహిత్ శర్మ కురేన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాతి ఓవర్లోనే కూరెన్  బౌలింగ్ లో రెండో  వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్. ఈసారి  డికాక్ 33(20) అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరినీ వరుసగా కోల్పోయిన ముంబాయి ఇండియన్స్ ఇబ్బందుల్లో పడింది. 

తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఆడటంతో వికెట్లు కోల్పోకుండా పది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 16* (12) పరుగులతోనూ  సౌరభ్ తివారీ 22* (17) పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. 





Tags:    

Similar News