Rajasthan Royals‌: 'రాయ‌ల్స్' అంబాసిడ‌ర్ గా షేన్ వార్న్‌

Rajasthan Royals‌: యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ ఆర్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ యాజ‌మాన్యం ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ను త‌మ జ‌ట్టు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియ‌మించిన‌ట్టు ప్రక‌టించింది

Update: 2020-09-14 12:13 GMT

IPL 2020: Shane Warne reappointed Rajasthan Royals mentor

Rajasthan Royals‌: యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ ఆర్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ యాజ‌మాన్యం ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ను త‌మ జ‌ట్టు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియ‌మించిన‌ట్టు ప్రక‌టించింది. షేన్ వార్న్‌ను రెండో ఏడాది త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డం విశేషం. అంతేకాదు షేన్‌ వార్న్ ఆర్‌ఆర్ జట్టుకు‌ మెంటార్‌గానూ వ్యవహరించనున్నారు.

వార్న్‌ సారథ్యంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆరంభ ఐపీఎల్‌ సీజన్‌ 2008లో చాంపియన్ ట్రోపీని కైవ‌సం చేసుకుంది.‌ జట్టులోని యువ ఆటగాళ్లకు వార్న్‌ మార్గనిర్దేశనం చేయడానికి ఫ్రాంఛైజీ టైటిల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను మళ్లీ ఆహ్వానించింది. 2011 వరకు రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లెజండరీ క్రికెటర్‌ ఆ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంచైజీ నాకు రెండు బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం. నేను ఇష్టపడే ఆర్‌ఆర్ ఫ్రాంచైజీ, నా కుటుంబంలోకి తిరిగి రావడం ఎల్లప్పుడూ గొప్ప అనుభూతి. అభిమానులు ఇష్టపడే మరియు అనుసరించే గ్లోబల్ టీమ్‌గా మారాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఈ సీజన్‌లో నేను టీమ్ మెంటర్‌గా పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. జుబిన్ భారుచా, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వంటి అద్భుతమైన కోచింగ్ బృందం ఉంది' అని షేన్‌ వార్న్ తెలిపారు.

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్ 'స్పిన్‌ మాంత్రికుడు. ఆయ‌న మాయాజాలంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ ‌(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.  

Tags:    

Similar News