IPL 2020: అరుదైన రికార్డు ముంగిట‌ విరాట్ కోహ్లీ

IPL 2020: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి రికార్డుల రారాజు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫామ్ పరంగా క్రికెట్ ప్రపంచానికి అతనో అద్భుతం. రికార్డుల్ని వేటాడటంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా

Update: 2020-10-05 09:36 GMT

IPL 2020: అరుదైన రికార్డు ముంగిట‌ విరాట్ కోహ్లీ  

IPL 2020: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి రికార్డుల రారాజు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫామ్ పరంగా క్రికెట్ ప్రపంచానికి అతనో అద్భుతం. రికార్డుల్ని వేటాడటంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. సాధారణంగా లక్ష్య ఛేదన సమయంలో ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం భారీ టార్గెట్ కళ్ల ముందు కనిపిస్తుంటే.. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తాడు. ప్రత్యర్థి బౌలర్ల పై మరింతగా రెచ్చిపోతుంటాడు.

ఇప్పుడు .. విరాట్ కోహ్లిని టీ20ల్లో మ‌రో అరుదైన రికార్డు ఊరిస్తోంది. నేడు జ‌రుగ‌నున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో కోహ్లి మరో పది పరుగులు చేస్తే చాలు.. టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకుంటాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డ్ సృష్టిస్తాడు. మొత్తంగా టీ20 ఫార్మ‌ట్‌లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలుస్తాడు.

ఐపీఎల్‌లో 181 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 5502 పరుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో క్రికెటర్‌గా కోహ్లి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లబ్‌లో రైనా, కోహ్లి, రోహిత్ మాత్రమే చేరారు. టీ20ల్లో 270 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 41.05 యావరేజ్‌, 134.25 స్ట్రైక్ రేట్‌తో 8990 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయి. అలాగే కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కూ ఐపీఎల్‌లో 192 సిక్సులు కొట్టాడు. మరో 8 సిక్సులు కొడితే 200 సిక్సుల మార్క్‌ను చేరుకుంటాడు.  

Tags:    

Similar News