IPL 2020: తేవాటియాకు స్పెషల్ గిప్ట్ ఇచ్చిన కోహ్లి

IPL 2020: రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్‌ ఆట‌గాడు రాహుల్ తేవాటియాకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన కానుకను అందించారు. తెవాటియా బ్యాటింగ్‌కు ముగ్దుడైన కోహ్లీ.. తన జెర్సీని అతడికి బహూకరించాడు

Karampoori Rajesh
Published on: 5 Oct 2020 2:35 PM IST
IPL 2020: తేవాటియాకు స్పెషల్  గిప్ట్ ఇచ్చిన కోహ్లి
X

IPL 2020: తేవాటియాకు స్పెషల్ గిప్ట్ ఇచ్చిన కోహ్లి

IPL 2020: రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్‌ ఆట‌గాడు రాహుల్ తేవాటియాకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన కానుకను అందించారు. తెవాటియా బ్యాటింగ్‌కు ముగ్దుడైన కోహ్లీ.. తన జెర్సీని అతడికి బహూకరించాడు. ఆ జెర్సీపై 'డియర్‌ రాహుల్‌.. బెస్ట్‌ విషెస్' అని రాసి ఆటోగ్రాఫ్‌ చేసి ఇచ్చాడు. శనివారం సాయంత్రం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ సమయంలోనే కోహ్లీ తెవాటియాకు గిఫ్ట్ ఇచ్చాడు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెమ్మదిగా ఆడిన రాహుల్‌ తెవాటియా.. రాయల్స్ అభిమానులతో తిట్లు తిన్నాడు. క్రీజులో కుదురుకున్న తెవాటియా.. ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత 19 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన తెవాటియా.. తర్వాత 12 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. పంజాబ్‌ బౌలర్‌ షెల్డన్ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో తెవాటియా ఒక్కసారిగా స్టార్ అయ్యాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story