IPL 2020: ఆ ఓవ‌ర్‌లో సైనీ బౌలింగ్ "సూప‌ర్" : విరాట్ కోహ్లీ

IPL 2020: ఆ ఓవ‌ర్‌లో సైనీ బౌలింగ్ సూప‌ర్ : విరాట్ కోహ్లీ
x

IPL 2020: ఆ ఓవ‌ర్‌లో సైనీ బౌలింగ్ "సూప‌ర్" : విరాట్ కోహ్లీ

Highlights

IPL 2020: ఐపీఎల్‌2020 సీజ‌న్‌లో ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగుతుంది. ప్ర‌తి జ‌ట్టు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ సీజ‌న్‌లో నిన్న రాజ‌స్థాన్‌, ముంబాయిల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఓ.. అద్భుతం

IPL 2020: ఐపీఎల్‌2020 సీజ‌న్‌లో ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగుతుంది. ప్ర‌తి జ‌ట్టు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ సీజ‌న్‌లో నిన్న రాజ‌స్థాన్‌, ముంబాయిల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఓ.. అద్భుతం . చివ‌రి ఓవ‌ర్ లో చివ‌రి బంతికి వ‌ర‌కూ గెలుపొటములు దాగుడుమూత‌లు ఆడింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ టై అయ్యి.. సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీసింది.

కోహ్లీ ఎంతో వ్యూహాత్మ‌క ఆలోచించి.. సూపర్‌ ఓవర్లో నవదీప్‌ సైనీ పంపించాడు. కోహ్లీ న‌మ్మకాన్ని త‌గట్టుగా.. బ‌రిలోకి దిగిన సైనీ.. ముంబై బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా‌, కీరన్ పొలార్డ్‌ల‌ను పరుగులు చేయకుండా క‌ట్ట‌డి చేశాడు. 7 పరుగులకే ముంబైని పరిమితం చేసి ఓ వికెట్ కూడా తీశాడు.

అనంత‌రం కోహ్లీ మాట్లాడుతూ.. సూపర్ ‌ఓవర్‌లో నవదీప్‌ సైనీ అద్భుతంగా రాణించాడు. సూపర్‌ ఓవర్లో హార్దిక్‌, పొలార్డ్‌కు బంతులు వేయడమంటే సాధారణ విషయం కాదు. సైనీ ప్రదర్శన సూపర్. పెద్ద బౌండరీలు కావడంతో యార్కర్లు వేసేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ఎందుకంటే అతడికి వేగం ఉంది. అంతేకాకుండా వైడ్‌ యార్కర్లు బాగా వేశాడు. తీవ్ర‌మైన ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ వేశాడని పేర్కొన్నాడు.

మొదట బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా.. ఆ తర్వాత బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories