IPL 2020: వార్నింగ్ ఇచ్చి మరీ .. విధ్వంసం సృష్టించిన వాట్స‌న్‌

IPL 2020: వార్నింగ్  ఇచ్చి మరీ ..   విధ్వంసం సృష్టించిన వాట్స‌న్‌
x

వార్నింగ్ ఇచ్చి మరీ .. విధ్వంసం సృష్టించిన వాట్స‌న్‌

Highlights

IPL 2020: ఐపీఎల్... ప్రతి రోజూ ఓ ఉత్కంఠభ‌రిత‌మైన క్రీడా వినోదాన్ని అందిస్తున్న‌ది. నిన్న జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ పై చెన్నై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

IPL 2020: ఐపీఎల్... ప్రతి రోజూ ఓ ఉత్కంఠభ‌రిత‌మైన క్రీడా వినోదాన్ని అందిస్తున్న‌ది. నిన్న జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ పై చెన్నై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓపెన‌ర్లే.. మ్యాచ్ గెలిపించారు. దీంతో చెన్నై 10 వికెట్ల తేడాతో రికార్డు విక్ట‌రీని అందుకుంది. గత మ్యాచ్ లలో అంత‌గా రాణించని వాట్సన్ నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ ను అందించాడు. త‌న బ్యాట్ ను ఝూళిపించి.. ప‌రుగుల వ‌ర‌ద‌ను పారించాడు. తాను ఫామ్ లోకి వస్తే ఎలాగుంటుందో చూపించాడు.

ఈ మ్యాచ్ కు ఒక్క రోజు ముందు వాట్సన్ తన ట్విట్టర్ ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌ను హెచ్చ‌రించి.. మ‌రీ వాట్సన్ చెలారేగాడు. ఏ బౌల‌ర్‌ను కూడా వ‌ద‌ల‌లేదు. దొరికిన ప్ర‌తి బంతిని బాదాడు.' చెన్నై సూపర్ కింగ్స్ కు పర్ఫెక్ట్ గేమ్ అన్నది రావాల్సి ఉంది' అని అక్టోబర్ 3న ట్వీట్ చేశాడు వాట్సన్.. అక్టోబర్ 4న అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చెన్నై జట్టుకు పర్ఫెక్ట్ విజయాన్ని అందించాడు. చెప్పి మరీ మంచి ఇన్నింగ్స్ ఆడావంటే నువ్వు నిజంగా సూపర్ బాస్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఆదివారం నాడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సుల‌తో 83 ప‌రుగులు చేసి నాటౌట్ నిలిచాడు. అలాగే డుప్లెసిస్ కూడా విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 53 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్సు తో 87 ప‌రుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ముగిసే వ‌ర‌కూ.. దుమ్ముదులుపుతూ .. అదే ఊపులో ఆడి చెన్నైకు విజయాన్ని అందించారు. వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇంతకు ముందు వాట్సన్ బ్యాటింగ్..చెన్నై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో వాట్సన్ 4, 33, 14, 1 పరుగులతో దారుణంగా విఫలమ య్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలనే డిమాండ్ వ్యక్తమైంది. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషకులు వాట్సన్ ఆటతీరును తప్పుబట్టారు. జట్టుకు కుదిబండగా మారాడన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అయితే వాట్సన్‌ను తప్పిస్తేనే సీఎస్‌కే గాడిలో పడుతుందని విమర్శించాడు. కానీ ధోనీ మాత్రం తన మార్క్ కెప్టెన్సీతో వాట్సన్‌పై నమ్మకం ఉంచాడు. దాంతో ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ పంజాబ్‌పై చెలరేగి ఫామ్‌లో వచ్చాయి. విమర్శకులకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.

అంతేకాకుండా.. ఈ మ్యాచ్‌లో వాట్సన్-డుప్లెసిస్ జోడి తొలి వికెట్‌కు అజేయంగా 181 రన్స్ జోడించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో హయ్యెస్ట్ రన్ చేజ్ నిలిచారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.


Show Full Article
Print Article
Next Story
More Stories