ఐపీఎల్ 2020 : సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే ..
ఐపీఎల్ 2020కి వేలం గురువారం ముగిసింది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
ఐపీఎల్ 2020కి వేలం గురువారం ముగిసింది. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిపి 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ సారి 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడుగురు క్రికెటర్లను కొనుగోలు చేసింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కీలక ఆటగాడు. అతనితోపాటు విండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ ఉన్నారు. వీరితోపాటు భారత క్రీకెటర్లు అండర్ -19 జట్టు కెప్టెన్ ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్‌లను దక్కించుకుంది. యువ క్రికెటర్లు సంజయ్ యాదవ్, అబ్దుల్ సమద్, భావనక సందీప్, సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదాబాద్ వద్ద వేలానికి ముందు రూ. 17 కోట్లు ఉన్నాయి. వేలంలో ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసి రూ. 6.9 కోట్లు ఖర్చు పెట్టింది.
వేలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ :
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్‌ను తలా రూ. 1.9 కోట్లు కొనుగొలు చేసింది. భువనేశ్వర్ కుమార్, భావనక సందీప్ , సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, అబ్దుల్ సమద్, వృద్దిమాన్ సాహా, జానీ బెయిర్‌స్టో, శ్రీవాత్సవ్ గోస్వామి, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టి నటరాజన్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్,
వేలానికి ముందు కొంతమంది ఆటగాళ్ళు విడుదల చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఐసీసీ నిషేదం ఎదుర్కొవడంతో అతన్ని పక్కన పెట్టింది. దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్, మార్టిన్ గుప్టిల్, రికీ భూయ్‌ని వదులుకుంది.
Fun both on and off the field, meet Fabian Allen, our Caribbean Riser! 🧡😄#IPLAuction #SRH2020Unlocked #OrangeArmy pic.twitter.com/9fFQ6chZ2J
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2019