IPL 2020: బ్రావోకు వినూత్నంగా స్వాగ‌తం ప‌లికిన సీఎస్‌కే

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) ఆటగాడు డ్వేన్ బ్రావోకు వినూత్న స్వాగ‌తం ప‌లికింది. తాజా క‌రేబియ‌న్ లీగ్‌ను పూర్తి చేసుకుని బ్రావో ఇటీవ‌ల ఐపీఎల్ 2020 కోసం యూఏఈ లో అడుగుపెట్టారు.

Update: 2020-09-13 09:49 GMT

Dwayne Bravo gets champion’s

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) ఆటగాడు డ్వేన్ బ్రావోకు వినూత్న స్వాగ‌తం ప‌లికింది. తాజా క‌రేబియ‌న్ లీగ్‌ను పూర్తి చేసుకుని బ్రావో ఇటీవ‌ల ఐపీఎల్ 2020 కోసం యూఏఈ లో అడుగుపెట్టారు. ఈ సీజ‌న్‌లో తనకు కేటాయించిన గదిలోని డైనింగ్‌ టేబుల్‌పై పలు రకాల పండ్లతో పాటు '500 వికెట్ల వీరుడికి దుబాయ్‌ కి సుస్వాగతం' అని తన జట్టు యాజమాన్యం పేర్కొంది. అలాగే కరోనా కిట్లు కూడా అందించింది.

అయితే టీ 20లో 500 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా బ్రావో నిలిచాడు. ఇటీవ‌ల కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడి బ్రావో ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకు టీ 20 క్రికెట్ చరిత్రలో మరే ఇతర బౌలర్ 400 వికెట్ల మార్కును కూడా దాటలేదు. దీని సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. 


Tags:    

Similar News