వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌కు సెల్యూట్ చేసిన ఫ్రాంచైజీలు
షెల్డన్ కాట్రెల్‌కు కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
ఐపీఎల్ సీజన్-13కి గురువారం వేలం జరుగుతోంది. ఈ వేలంలో విదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలుకుతున్నారు. వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత దేశానికి సంబంధించిన ఆటగాళ్లు 713 మంది ఉన్నారు. ఇతర దేశానికి సంబంధించిన 258 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. వీరిలో దాదాపు 19 మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 634 మంది దేశావాలీలో పాల్గొన్నారు. ఇక 60 మంది క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచ్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది.
*ఈ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీని రూ.50లక్షల కనీస ధర నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.4 కోట్లకు కోనుగోలు చేసింది.
*జయదేవ్ఉనద్కత్ మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. రూ.1కోటి ధర నుంచి రూ.3 కోట్లకు కోనుగోలు చేసింది. ఈ వేలంలో ఉనద్కత్ కోసం కింగ్స్ ఎలెవన్ పోటీపడింది. గతంలో 2019 సీజన్ లో 8.40కోట్లు పెట్టి రాజస్థాన్ ఉనద్కత్ తీసుకున్న సంగతి తెలిసిందే.
*ఆస్ట్రేలియా ఫేస్ బౌలర్ కౌల్టర్ నైల్‌ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది.
*వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది.
* భారత జట్టు ఆల్ రౌండర్ పియూష్ చావ్లా కోసం చైన్నె సూపర్ కింగ్స్ రూ.6.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పియూష్ చావ్లా కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోటీపడ్డాయి. చివరి నిమిషంలో చైన్నె కోనుగోలు చేసింది.
ముష్ఫికర్ రహీమ్( బంగ్లా) నమన్ ఓజా(ఇండియా) పెరీరా( శ్రీలంక) స్టేయిన్ ( సౌతాఫ్రికా) హోప్స్ ( వెస్టిండీస్ ) మోహిత్ (ఇండియా) కోనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
*ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోసం బెంగళూరు, కోల్‌కతా పోటీపడ్డాయి.కనీస ధర కోటి నుంచి చివరికి రూ. 4.40 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.
*దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్‌మోరిన్ భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర 1.5 కోట్లు ఉన్న అతడి కోసం ముంబయి ఇండియన్స్ కోనుగోలు చేసేదుకు పోటీపడింది. చివరి నిమిషంలో బెంగళూరు అతడిని దక్కించుకుంది.
* ఇంగ్లాండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 5.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.
* ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కరణ్ రూ.5.5 కోట్లకు చైన్నె అతడిని దక్కించుకుంది. కింగ్స్ ఎలెవన్ అతడిని వేలానికి విడిచింది. గత సంవత్సరం రూ.7.20కోట్లకు పంజాబ్ కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
*ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వేలం యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో ఉన్నాడు. 2015లో ఢిల్లీ జట్టుభారీ ధరకు దక్కించుకుంది. యూవీ తర్వాతీ స్థానంలో కమిన్స్ కోల్‌కతా రూ.5.50 నిలిచాడు. 2017లో పుణె రూ.4.50 కోట్లకు కమిక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా కమిన్స్‌కు రూ.15.50 కోట్లు ధర పలికాడు. ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. రూ.2 కోట్ల కనీస ధర మొదలు నుంచి రూ.15.50 కోట్లకు పలికాడు. బెంగళూరు, కోల్‌కత్తా ఢిల్లీ జట్లు అతడిని కోనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.చివరికి కోల్‌కతాకు 15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
*ఆస్టేలియాన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్10 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది.
*ఢిల్లీ క్యాపిటల్స్ ఇంగ్లాండ్ జేసన్ రాయ్‌ను కనీస ధర రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
*రాజస్థాన్ రాయల్స్ టీమిండియా ఆటగాడు ఉతప్పను రూ.3 కోట్ల కోనుగోలు చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టును టైటిట్ సాధించడంలో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు.
* టీమిండియా ప్లేయర్లు యూసఫ్ పఠాన్, విహారి, పూజారాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంజైజీ ఆసక్తి చూపలేదు.