ఐపీఎల్‌ వేలం : భారీ ధర పలికిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు

ఐపీఎల్‌ సీజన్‌-13కి గురువారం వేలం జరుగుతోంది. వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు.

Update: 2019-12-19 10:42 GMT
IPl 2020 Auction

ఐపీఎల్‌ సీజన్‌-13కి గురువారం వేలం జరుగుతోంది. వేలంలో మొత్తం 971 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత దేశానికి సంబంధించిన ఆటగాళ్లు 713 మంది ఉన్నారు. ఇతర దేశానికి సంబంధించిన 258 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. వీరిలో దాదాపు 19 మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 634 మంది దేశావాలీలో పాల్గొన్నారు. ఇక 60 మంది క్రికెటర్లు ఐపీఎల్‌ మ్యాచ్‌ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది.

*ఢిల్లీ క్యాపిటల్స్ ఇంగ్లాండ్ జేసన్ రాయ్‌ను కనీస ధర రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.

*రాజస్థాన్ రాయల్స్ టీమిండియా ఆటగాడు ఉతప్పను కోనుగోలు చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టును టైటిట్ సాధించడంలో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు.

* ఇంగ్లాండ్ ప్లేయర్ మోర్గాన్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 5.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.

*టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర పుజారా, హను విహారికి మొండి చేయి ఎదురైంది. ఈ వేలంలో పూజారాను కోనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైంజీ ఆసక్తి చూపించలేదు.

ఎనిమిది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. 971 మంది ఆటగాళ్లలో తాము కోరుకుంటున్న క్రికెటర్ల పేర్లను డిసెంబర్‌ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు సమర్పించిన జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఈ సారి ఐపీఎల్‌లో ప్రస్తుతం 73 మందిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సారి వేలానికి కోత్‌కత్తా వేదిక కానుంది.అఫ్గానిస్తాన్ కుర్రాడు నూర్‌ అహ్మద్‌ వేలంలో చిన్నవాడు. అయితే ఈ బౌలర్‌ వయసు కేవలం 14 ఏళ్ల 850 రోజులే కావడం విశేషం. ఇటీవల భారత్‌తో అండర్‌-18 సిరీన్‌లో నూర్‌ అహ్మద్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Tags:    

Similar News