IPL 2020 Anthem: ఆ గీతాన్ని కష్టపడి రూపొందించాం: ప్రణవ్ రావ్ మాల్ప్
IPL 2020 Anthem: దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. క్రీడాకారులు ఉత్తేజపరచడానికి ఐపీఎల్ 2020 నేపథ్య గీతాన్ని రూపొందించిన విషయం తెలిసిందే
IPL 2020 Anthem
IPL 2020 Anthem: దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. క్రీడాకారులు ఉత్తేజపరచడానికి ఐపీఎల్ 2020 నేపథ్య గీతాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. కానీ..ఇటీవల ఈ గీతంపై వివాదం ముసురుకుంది. తన పాటను కాపీ చేశారనీ ర్యాపర్ కృష్ణ ఆరోపించగా.. ఆయన వ్యాఖ్యలను ఆ పాటని సృష్టించిన ప్రణవ్ రావ్ మాల్ప్ ఖండించారు. ఐపీఎల్ సాంగ్‌ను కాపీ చేయలేదని, చాలా కష్టపడి స్వయంగా రూపొందించానని ఐపీఎల్ పాట రూపకర్త ప్రణవ్ పేర్కొన్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితులను మేళవిస్తూ ఈ పాటను రూపొందించారు. కరోనా కారణంగా అంతా మారిపోయింది. ముఖాలకు మాస్కులు, ఒకరికొకరు దూరం, అవసరానికి మించి చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు రుద్దుకోవడం, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేకపోవడం, పనులు చేసుకోలేకపోవడం వంటి అంశాలను పాటలో ఉంచారు.
'నేను షాకయ్యాను. నేనే స్వయంగా బాణిని రూపొందించాను. ఇతర కళాకారుల పాటను కాపీ చేయలేదు. నేను, నా జట్టు ఎంతో కష్టపడి దీనిని రూపొందించాం. భారత సంగీత రూపకర్తల సంఘం (ఎంసీఏఐ) సైతం నా పాట నిజమైందేనని ధృవీకరించిందని అన్నారు.మళ్లీ ప్రజలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఐపీఎల్ వచ్చేసిందంటూ.. 'ఆయేంగే హమ్ వాపస్'ను రూపొందించారు.
తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నారు. 2017లో తాను రూపొందించిన 'దేఖ్ కౌన్ ఆయా వాపస్'కు ఇది కాపీ అని అతడు అంటున్నాడు. అయితే కృష్ణ కౌల్ ఆరోపణలను ఐపీఎల్ గీతం రూపకర్త ప్రణవ్ అజయ్ రావ్ మాల్ప్ తాజాగా ఖండించారు. ఐపీఎల్ నేపథ్య గీతంను కాపీ చేయలేదని స్పష్టం చేశారు.