T20 World Cup : అమ్మాయిలు అదరగొట్టారు.. సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు

మెల్‌బోర్న్ వేదికగా జరగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ మూడో మ్యాచ్‌లో కివీస్‌పై ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది.

Update: 2020-02-27 07:34 GMT
IND VS NZ ICC T20 World Cup

మెల్‌బోర్న్ వేదికగా జరగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ మూడో మ్యాచ్‌లో కివీస్‌పై ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-ఏలో జరిగిన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సెమీస్ చేరింది. ఈ నెల 29న శ్రీలంకతో చివరి మ్యాచ్ జరగాల్సి ఉంది. కివీస్ పై జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు చేరింది. గ్రూప్ -ఏలో తన చివరి మ్యాచ్ శ్రీలంకపై ఈ నెల 29న జరగనుంది.

టీమిండియా ఓపెనర్ షెఫాలీవర్మ(46 పరుగులు, 34 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడగా.. తానియా భాటియా(23పరుగులు, 25 బంతుల్లో 3ఫోర్ల)తో రాణించింది. న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో, టీమిండియా మిగతా బ్యాట్స్‌ఉమెన్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్‌ స్మృతి మంధాన(11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(1) మరోసారి నిరాశపరిచారు. రోడ్రిగ్స్‌(10), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) పూర్తిగా విఫలమయ్యారు. ఆఖరి ఓవర్లలో శిఖాపాండే(10), రాధా యాదవ్‌(14) నిలవడంతో కివీస్ ముందు 134 లక్ష్యం ఉంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ , అమెలియా కెర్ర చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాహుహు, సోఫీ డివైన్, కాస్పెరిక్‌ తలా ఓ వికెట్ తీశారు.

భారత్ నిర్థేశించిన 134 పరుగలు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. ఓపెనర్‌ రేచల్‌ ప్రీస్ట్‌(12) తొలి ఓవర్లో చెలరేగినా.. శిఖా పాండే వేసిన రెండో ఓవర్‌లో ఔటైంది. దీంతో 13 పరుగులకే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత సుజీబేట్స్‌(6) క్లీన్‌బౌల్డ్‌ అయింది. ఆరో ఓవర్ అందుకున్న దీప్తిశర్మ చక్కటి డెలివరీతో సుజీని బొల్తా కొట్టించింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో వరుస వికెట్లు కోల్పోయింది. మార్టిన్ 25 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివర్లో అమెలియా కెర్ర‌(34 పరుగులు, 18 బంతుల్లో 6 ఫోర్ల)తో ధాటిగా ఆడినా న్యూజిలాండ్ గెలుపొందలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, పాండే, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, గౌక్వాడ్ తలా ఓవికెట్ పడగొట్టారు. 

 

Tags:    

Similar News