ఐపీఎల్‌ ప్రారంభ తేదీపై గందరగోళం

ఐపీఎల్‌ సీజన్‌ 13 ఇటీవలే వేలం ముగిసింది. అయితే తాజాగా ఐపీఎల్ ప్రారంభ తేదీపై స్పష్టత రావాల్సింది.

Update: 2019-12-21 16:56 GMT
Indian premier league 2020

ఐపీఎల్‌ సీజన్‌ 13 ఇటీవలే వేలం ముగిసింది. అయితే తాజాగా ఐపీఎల్ ప్రారంభ తేదీపై స్పష్టత రావాల్సింది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ -13 సీజన్ మార్చి 28 నిర్వహిచాలని గవర్నింగ్‌ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ తేదీపై ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మొత్తం ఏనిమిది అ‌భ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనుంది. మార్చి 28 కాస్త ఏప్రిల్ 1కి మార్చాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.

అయితే తేది మార్పుపై అన్ని ఫ్రాంచైజీలు డిమాండ్ చేయడంపై అనేక కారణాలు ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు. విదేశీ ఆటగాళ్లు మార్చి 28కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్, అలాగే ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ మార్చి 31 వరకూ జరగనున్నాయి. దీంతో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏప్రిల్ వరకు అందుబాటులో ఉండరు. ఈ లోగా ఐపీఎల్ నిర్వహిస్తే ఆ జట్ల ఆటగాళ్లకు వెంటనే జట్టులో చేరితే వారిపై శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో మార్చి 28 తేదీనే మ్యాచ్‌లు జరిగితే నాలుగు దేశాల క్రికెటర్లు మ్యాచులకుదూరంగా ఉంటారు.

ఈ సారి ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చెందిన క్రికెటర్లే అధికంగా ఉన్నారు. దీంతో వారు అందుబాటులో లేకపోతే ఫ్రాంచైజీలు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి ఐపీఎల్‌ ప్రారంభమైతే ఒకటి రెండు మ్యాచ్ ల వరకు మాత్రమే వారు దూరం అవుతారు. ఫ్రాంచైజీలు గవర్నింగ్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లాయని ఓ అధికారి తెలిపారు. దీనిపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీ జరిపే అవకాశం ఉంది. గవర్నింగ్‌ కౌన్సిల్‌ తేదీ మార్పుకు అంగీకరిస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఐపీఎల్ మొదలైయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News