డేవిస్‌కప్‌: రెండింటిలోనూ గెలిచిన భారత్

Update: 2019-11-30 01:47 GMT
Davis Cup FilePhoto

 డేవిస్ కప్‌లో భారత్ మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై పైచేయి సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టెన్నిస్‌ జట్టుపై భారత్ యువ టెన్నిస్ క్రీడాకారులు విజయకేతనం ఏగరవేశారు. ఈ మ్యాచ్ లో భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించుకుంది. మొదటి మ్యాచ్ ప్రపంచ 176వ ర్యాంకర్, రామ్ కుమార్ రామనాథన్ 6–0, 6–0తో షోయబ్ మొహమ్మద్ పై విజయం సాధించాడు. 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ వరల్డ్ 176వ ర్యాంకర్ ఐదు ఏస్లు సంధించాడు. షోయబ్ రెండు రెండు సెట్లలోనూ ప్రతిభ కనబరచలేక పోయాడు.

ఇక రెండో మ్యాచ్‌లో 131వ ప్రపంచ ర్యాంకర్, 22ఏళ్ల సుమీత్ 6-0,6-2తో 17 అబ్దుల్ రెహ్మాన్ పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ గంట నాలుగు నిమిషాల సమయంలో సుమీత్ మ్యాచ్ ను ముగించాడు. మొదటి సెట్ సునాయాసంగా విజయం సాధించినా, రెండు సెట్ కాస్త పోటీ ఎదురైంది. రెహ్మాన్ రెండు గేములు విజయం సాధించాడు. దీంతో 6-2తో సుమీత్ మ్యాచ్ ముగించాడు. మూడో మ్యాచ్ శనివారం డబుల్స్ జరగనుంది. భారత్ క్రీడాకారులు లియాండర్ పేస్- జీవన్ జోడీ రెహ్మాన్‌–షోయబ్‌ మొహమ్మద్‌ డబుల్స్ మ్యాచ్ జరగనుంది. డేవిస్‌కప్‌లో పాక్‌తో 6సార్లు తలపడిన భారత్ విజయం సాధించింది. మరోసారి ఇలాంటి ప్రదర్శనే రిపీట్ అవనుందని భావిస్తుంది.

Tags:    

Similar News