Ind Vs WI 3rd T20 : మళ్లి నిరాశపరిచిన పంత్

Update: 2019-12-11 14:51 GMT
రిషబ్ పంత్ File Photo

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగుతుంది. భారత్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సొంత గడ్డపై రోహిత్ శర్మ(71, 34 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సులు)లతో చెలరేగిపోయాడు. ఇద్దరు ఓపెనర్లు బౌండరీలు, సిక్సర్లుతో విండీస్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. ప్రమాధకరంగా మారిన ఓపెనర్ల జోడిని కేస్రిక్ వీడతీశాడు. మరో ఓపెనర్ రాహుల్(75, 43బంతుల్లో, 8ఫోర్లు, 3 సిక్సు)తో అర్థ సెంచరీ నమోదు చేసి ధాటిగా ఆడుతున్నాడు. కోహ్లీ(22)తో క్రీజులో ఉన్నాడు.

రెండో టీ20లో శివమ్ దూబే మూడో బ్యాట్స్ మెన్ గా వస్తే ఈ సారి రిషబ్ పంత్ వచ్చాడు. అయితే రెండు బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే ఔటైయ్యాడు. ఇటీవలే రిషబ్ పంత్‌ను తొలిగించి సంజూ శంస్సన్ కు అవకాశం ఇవ్వాలని కొందరూ సినీయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ కోహ్లీ మద్దతు ఉండడంతో తుది జట్టులో కొనసాగుతన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా రిషబ్ నిరాశపరిచాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 



Tags:    

Similar News