IndvsWI 3rd ODI : కీలక వికెట్లు పడగొట్టిన నవదీప్‌ సైనీ

టీమిండియా విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ భాగంగా కటక్ వేదికగా మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి విండీస్‌ను భారత్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Update: 2019-12-22 10:19 GMT
Shimron Hetmyer File Photo

టీమిండియా విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ భాగంగా కటక్ వేదికగా మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి విండీస్‌ను భారత్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది.బ్యాటింగ్ ప్రాంభించిన విండీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ లూయిస్ (21 పరుగులు, 50బంతుల్లో, 3ఫోర్లు,) చేసి జాడేజా బౌలింగ్‌లో ఔటైయ్యాడు. హోప్ (42పరుగులు, 50 బంతుల్లో, 5 ఫోర్లు ) షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 32 ఓవర్లు ముగిసేసరిగి విండీస్ నాలుగు వికెట్లు నష్టానికి 145 పరుగులు చేసింది.

హెట్‌మైర్ (37 పరుగులు, 33 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు)నవదీప్‌ సైనీ విసిరిన ఔట్ సైడ్ ఆఫ్ స్టేప్ బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైయ్యాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్ కి తాకి కుల్ దీప్ యాదవ్ చేతికి దొరికిపోయాడు. నవదీప్‌ సైనీ అనంతరం ఛేజ్(38) కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. పూరన్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జాడేజా, షమీ, నవదీప్‌ సైనీ తలో ఓ వికెట్ తీశారు

గాయం కారణంగా దీపక్‌ చాహర్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవదీప్‌ సైనీ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడుతున్న నవదీప్‌ సైనీకి ‎విధ్వంసక ఆటగాడు హెట్‌మైర్ వికెట్ పడగొట్టడం విశేషం. ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి. 

Tags:    

Similar News