Ind vs WI 2nd ODI : రోహిత్ 150 నాటౌట్ .. భారీ స్కోరు దిశగా భారత్

విశాఖ వేదికగా వెస్టిండీస్ భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు.

Update: 2019-12-18 11:06 GMT
india vs west indies 2nd odi

విశాఖ వేదికగా వెస్టిండీస్ భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ . ఓపెనర్లు రాహుల్ (102పరుగులు, 104 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు) సాయంతో సెంచరీ చేశాడు. మరో ఓపెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ( 154పరుగులు,133 బంతుల్లో 16ఫోర్లు, 5సిక్సు)తో ఇరువురు కలిసి తొలి వికెట్‌కు 227 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.

అయితే వీరి జోడిని విండీస్ సారథి పొలార్డ్ విడతీశాడు. రాహుల్ 102 పరుగుల వద్ద ఉండగా పొలార్డ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించాడు. దీంతో చేజ్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొదటి పవర్ ప్లేలో 55 పరుగులు మాత్రమే రాబట్టిన ఈ జోడీ రెండో పవర్ ప్లేలో భారీ స్కోరు సాధించింది. రెండో పవర్ ప్లేలో 172 పరుగులు పిండుకున్నారు. రాహుల్ , రోహిత్ ఒకరి తర్వాత ఒకరు పరుగులు వరద పారించారు.

రాహుల్ ఔట్ అయ్యిన అనంతరం బరిలోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కోహ్లీ పరుగులేమి చేయకుండానే పొలార్డ్ బౌలింగ్ లో చేజ్ క్యాచ్ అవుట్‌గా దొరికిపోయాడు. ఒక ఎండ్ లో రోహిత్ విజృంభిస్తుండగా మరో ఎండ్‌లో శ్రేయస్స్ అయ్యార్ రాణిస్తున్నాడు. దీంతో 42 ఓవర్లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

Tags:    

Similar News