IND vs WI 1st T20 : కరీబియన్ జట్టు సిక్సర్లు రికార్డు..భారత్ ముందు భారీ లక్ష్యం

Update: 2019-12-06 14:52 GMT

టీమిండియాల వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా తొలి టీ20 జరుగుతుంది. నిర్ణిత ఓవర్లో విండీస్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చిసింది. 207 పరుగల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ లెండిల్ సిమన్స్(2) పరుగులకే ఔటైయ్యాడు. దీంతో 13 పరుగులకే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ఎవిన్ లూయిస్(40 పరుగులు,17 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బ్రాండన్ కింగ్(31), హోల్డర్(24 నాటౌట్,1 ఫ్లోర్, 2సిక్సర్లు),‎రాందిన్(11 నాటౌట్: 7 బంతుల్లో ఫోర్) మెరుపులు మెరిపించారు.

టీ20 కరీబియన్ జట్టు రికార్డు నెలకొల్పింది. ‎‎15 సిక్సర్లు లతో భారత బౌలర్లపై విరుచుపడ్డారు. హెట్‌మైర్(56పరుగులు 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో 20 ఓవర్లలో‎ 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. చాహర్ వేసిన 17వ ఓవర్లో హెట్‌మైర్ ఇచ్చిన క్యాచ్ ను భారత ఫిల్డార్లు జారవిడిచారు. భువనేశ్వర్ కుమార్ వేసిన 20వ ఓవర్లో హోల్డర్ 17 పరుగులు రాబట్టారు. 

Tags:    

Similar News