India vs South Africa 3rd Test : తొలి సెషన్‌లో భారత్‌కి ఎదురుదెబ్బలు

దక్షిణాఫ్రికాతో రాంచీ వేధికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ విరామ సమయానికి భారత్ 71 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

Update: 2019-10-19 06:12 GMT

దక్షిణాఫ్రికాతో రాంచీ వేధికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ విరామ సమయానికి భారత్ 71 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే భారత్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు.

తొమ్మిదిబంతులు ఎదుకొన్న పుజారాలను ఖాతా తెరవకుండా రాబడ చేతిలోనే ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో జట్టు స్కోరు 25/2 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలో దిగిన కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి ఔటైయ్యాడు. దీంతో జట్టు స్కొరు 39/3 వికెట్లు కోల్పోయింది కష్టాల్లో పడింది. భారత జట్లు ఓపెనర్ రోహిత్ శర్మ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రహానే 11 పరుగులతో నిలకడగా అడుతున్నారు. లంచ్ విరామ సమయానికి భారత్ 71 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

Tags:    

Similar News