India vs New zealand 2nd test Day 1 : కోహ్లీ ఔట్.. కీలక వికెట్లు కోల్పోయిన భారత్

Update: 2020-02-29 01:43 GMT
India Vs Nz 2nd Test

హాగ్లీ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌ భారత్‌ రెండో టెస్టు జరుగుతుంది. భోజన విరామ సమయాలనికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. రెండో సెషన్ ఆరంభం అయిన కొద్దీసేపటికే కోహ్లీ(3) కూడా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన కివీస్ భారత్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 30 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో సారి న్యూజిలాండ్ కు అవకాశం ఇవ్వలేదు. పుజారా(15)తో కలిసి ఓపెనర్ పృధ్వీషా (54 పరుగులు, 64బంతుల్లో, 8ఫోర్లు, 1 సిక్సు)తో ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. పృథ్వీ షా వన్డే మ్యాచ్ తలపించేలా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లపై విరుచుపడ్డాడు. 47 పరుగులు వద్ద వాగ్నెర్ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి 60 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జేమీసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి లేథమ్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(3) వెంటనే అవుటై తన పేలవ ఫామ్ కొనసాగించాడు. 




Tags:    

Similar News