Ind vs Ban 2nd Test : చారిత్రక టెస్టులో భారత్ రికార్డు విజయం

టీమిండియా విజయల పరంపర కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.

Update: 2019-11-24 09:01 GMT
India vs Bangladesh 2nd Test India won by an innings and 46 runs

టీమిండియా విజయల పరంపర కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ జట్టు 195 పరుగులకి కుప్పకూలిపోయింది. గాయం కారణంగా బంగ్లా బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి చేయలేదు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవటే దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు సిరీస్ కూడా భారత్ వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. స్వదేశంలో వరుసగా 12 టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ డే/నైట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 106 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 347/9తో డిక్లేర్ చేసింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ (136: 194 బంతుల్లో 18x4) సెంచరీ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ 241 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 195 పరుగులకే బంగ్లా ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ 78 పరుగులు ఇచ్చి 9 వికెట్లు, ఉమేశ్ 8 వికెట్లు తీశారు. మహ్మద్ షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది 'సిరీస్ అవార్డును ఇషాంత్ సొంతం చేసుకున్నాడు. 



Tags:    

Similar News