IND vs AUS: ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
IND vs AUS: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
IND vs AUS: ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆసీస్ రెండో టెస్టు జరుగుతోంది. భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీశారు. ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు, పీటర్ హ్యాండ్స్ కాంబ్ 72 పరుగులు, ప్యాట్ కమిన్స్ 33 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.