India vs Australia: ప్రారంభమైన మొదటి వన్డే..ఫించ్, వార్నర్ అర్థశతకాలు..25 ఓవర్లలో ఆసీస్134/0

సుదీర్ఘ విరామం అనంతరం భారత్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతోంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే కొద్దిసేపటి క్రితం పెర్త్ లో ప్రారంభం అయింది.

Update: 2020-11-27 06:05 GMT

Australia vs India first one-day highlights

చాలాకాలం తరువాత భారత క్రికెట్ జట్టు ఫీల్డులోకి దిగింది. కరోనా ఎఫెక్ట్ తో.. నిలిచిపోయిన అన్ని వ్యవస్థలతో పాటూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు టీమిండియా కూడా దూరం కావలసి వచ్చింది. చాలాకాలం తరువాత ఇప్పుడు కోహ్లీ సేన ఆస్ట్రేలియా తొ మూడు వన్డేల సిరీస్ లో పాల్గొంటోంది. దీనిలో మొదటి మ్యాచ్ పెర్త్ వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనల నడుమ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఐపీఎల్‌లో రాణించి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కింది. మయాంక్‌ అగర్వాల్‌తో పాటు పేసర్‌ నవదీప్‌ సైనీ సైతం తుది జట్టులో చోటుదక్కించుకున్నారు. ధావన్‌తో కలిసి మయాంక్‌ ఇన్సింగ్స్‌ను ప్రారంభినున్నాడు.

1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్‌ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగటం ఆకర్షణీయాంశం. సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాగా ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించి.. భుజాలకు నలుపు రంగు బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.

ఫించ్..వార్నర్ హాఫ్ సెంచరీలు..

ఆస్ట్రేలియా ఓపెనర్లు కుదురైన ఆటతీరు కనబరుస్తున్నారు. ఒక పక్క ఫించ్ బ్యాట్ కు పని చెబితే, వార్నర్ నిదానంగా ఆచి తూచి ఆడుతున్నాడు. దీంతో 25ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు వికెట్ కోల్పోకుండా 134 పరుగులు చేసింది. తొలుత ఆరోన్ ఫించ్ అర్థశతకం సాధించాడు. తరువాత చాలా సేపటికీ మెల్లగా వార్నర్ కూడా తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది.

భారత జట్టు : శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, వీరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌) శ్రేయస్‌ అయ్యార్‌, కేఎల్‌ రాహుల్‌, హర్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ, నవదీప్‌ శైనీ, యజ్వేంద్ర చహల్‌, బూమ్రా

ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్‌ పించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్కస్‌ స్టోయినిస్‌, లబ్‌షేన్, మాక్స్‌వెల్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్, స్టార్క్, ఆడం జంసా, హెజల్‌వుడ్‌

Tags:    

Similar News