IND V AUS 3rd ODI : స్మిత్ సెంచరీ... మరో ఐదు ఓవర్లు విగిలిన మ్యాచ్

Update: 2020-01-19 10:54 GMT

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలర్లను ఆసీస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. టీమిండియా బౌలర్లపై దాటిగా ఆడిన స్మిత్ (100 పరుగులు, 117బంతులు, 11 ఫోర్లు)లతో సెంచరీ నమోదు చేశాడు. స్మిత్ తన కెరీర్ లో 9వ శతకం నమోదు చేశాడు. నవదీస్ షైనీ వేసిన 44 ఓవర్ మూడో బంతిని సింగిల్ తీసి శతకం సాదించాడు. ఆలెక్స్ కారే (35, 36బంతుల్లో 6X4 ) పరుగులతో వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్స్ అయ్యారుకు క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. మరోవైపు స్మిత్, టర్నర్‌ క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లలో ఆసీస్ 200 పరుగుల దాటింది. 43.4 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి ఆస్టేలియా 237 పరుగులు చేసింది. ఇంకా ఐదు వికెట్లు చేతిలో ఉండడం మరో 5 ఓవర్లు మిగిలి ఉండడంతో ఆసీస్ 3వందల పరుగుల దాటే అవకాశం ఉంది. దీంతో భారత్ ముందు భారీ విజయలక్ష్యం ఉంచే అవకాశం కనిపింస్తుంది.

అంతకుముందు జడేజా వేసిన 32వ ఓవర్లో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. జడేజా వేసిన మూడో బంతికి మార్నస్ లుబుషేన్ (54 పరుగులు, 64 బంతుల్లో, 5ఫోర్లు ) కెప్పెన్ కోహ్లీ చేతికి దొరికిపోయాడు. దీంతో 108 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఇక అదే ఓవర్‌లో చివరి బంతికి విచెల్ స్టార్క్(0) గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి చాహల్ చేతికి చిక్కాడు. జడేజా ఈ ఓవరల్లో రెండు వికెట్లు తీసి పరుగులు ఇవ్వలేదు. భారత బౌలర్లలో జాడేజా రెండు వికెట్లు తీసుకోగా.. షమి, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 




Tags:    

Similar News