IND V AUS 3rd ODI : నిలకడగా ఆడుతున్న ఆసీస్

మూడో వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. త్వరగా ఓపెనర్ల వికెట్ కోప్పోయినప్పటికి స్మిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

Update: 2020-01-19 09:55 GMT

బెంగళూరు వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుంది. మాజీ సారధి స్మిత్ ఆర్ధసెంచరీ చేశాడు. 23 ఓవర్లో తొలి బంతిని బౌండరీ బాది స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆసీస్ ఆదిలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. షమీ విసిరిన అదర్భుతమైన బంతికి వార్నర్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంటనే జట్టు 46 పరుగుల వద్ద మరో ఓపెనర్ ఫించ్ మహ్మద్ షమీ వేసిన ఓవర్ లో పించ్ సింగల్ కోసం ప్రయత్నించాడు. స్మిత్ నిరాకరించడంతో ఫించ్ రనౌటైయ్యాడు. ఫీల్డర్ జాడేజా అందించింన బంతిని షమి వికెట్ల ముందు గిరాటేశాడు. దీంతో 46 పరుగులకే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. స్పిత్ (54), లబుషేన్ (34)తో క్రీజులో ఉన్నారు. 



 

Tags:    

Similar News