అండర్ -19 ప్రపంచ‌కప్‌లో చెత్త రికార్డ్.. 41పరుగులకే ఆలౌట్

అండర్ -19 ప్రపంచ కప్‌లో గ్రూప్ - ఏ విభాగంలో పసికూన జపాన్ పై జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు.

Update: 2020-01-21 12:22 GMT
India Under 19 team

అండర్ -19 ప్రపంచ కప్‌లో టీమిండియా కుర్రాళ్లు సత్తాచాటారు. . మంగళవారం గ్రూప్ - ఏ విభాగంలో పసికూన జపాన్ పై జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్లు రవిబిష్లోయ్ ఐదు వికెట్లతో చెలరేగిపోయారు. కార్తీక్ త్యాగి మూడు వికెట్లు, ఆకాశ్ సింగ్ రెండు వికెట్లు, విద్యాదర్ పాటిల్ ఒక వికెట్ తో జపాన్ పై విజృంబించారు. దీంతో జపాన్ జట్టు 41 పరుగులకే కుప్పకూలి పోయింది. టీమిండియా బౌలర్ల దాటికి జపాన్ బ్యాట్స్ మెన్ ల్లో ఐదుగురు ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టారు.

మొదట టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన జపాన్ ఆదిలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. జపాన్ జట్టు ఓపెనర్ కెప్టెన్ తుర్గేట్ (1) పరుగు చేసి ఆవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన నీల్ డేట్‌ ను గోల్డెన్ డకౌట్ చేశాడు భారత బౌలర్ త్యాగి. మరో ఓపెనర్ నోగుచి (7పరుగులు 17 బంతులు) ఎదుర్కొని బిష్ణోయ్‌ బౌలింగ్ లో వెనుదిరిగాడు. నోగుచి(7), డోబెల్(7) టాప్ స్కోరర్స్ గా నిలిచారు. ఓ దశలో 5గురు బ్యాట్స్‌మన్‌లు వరుసగా డకౌట్ అయ్యారు.

టీమిండియా బౌలర్ బిష్ణోయ్‌ 8 ఓవర్లు వేసి మూడు ఓవర్లు మేడిన్ చేశాడు. అంతేకాకుండా 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పేస్ బౌలర్ త్యాగి 6 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్ల దక్కించుకన్నారు. దీంతో జపాన్ భారత్ ముందు 42 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. 41 పురుగులు చేసి అండర్ -19 ప్రపంచ కప్ లో చెత్త రికార్డు నమోదు చేసింది. జపాన్ బ్యాట్స్ మెన్స్ చేసింది 21 పరుగలే కాగా.. భారత బౌలర్లు ఎక్స్ ట్ర్స్ రూపంలో 19 పరుగులు సమర్పించారు. లేదంటే జపాన్ 21 పరుగులకే ఆలౌట్ అయ్యేది. త్యాగి 9 వైడ్స్, బిష్ణోని 1, పాటిల్ 2 వైడ్లు వేశారు. ఆకాశ్ సింగ్ 4.5 ఓవర్లు వేసి 1 మేడిన్, 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

జపాన్ నిర్ధేశించిన 42 పరుగు విజలక్ష్యాన్ని భారత్ 4.5 ఓవర్లలో విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ 29 పరుగులు, కుమార కుషర్గ 13 పరుగులు చేసి ఘన విజయం అందించారు. గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అండర్‌-19 ప్రపంచకప్‌ 2004లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 చేసి ఆలౌట్ అయింది. జపాన్ రెండో 41 పరుగులు చేసి అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

 

Tags:    

Similar News