IND vs AUS: ఉత్కంఠ పోరు.. తొలి టీ20లో భారత్‌ విజయం

IND vs AUS: ఆసీస్‌పై 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

Update: 2023-11-24 03:12 GMT

IND vs AUS: ఉత్కంఠ పోరు.. తొలి టీ20లో భారత్‌ విజయం

IND vs AUS: వరల్డ్​కప్​ఫైనల్‌లో ఓటమి అనంతరం.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం అందించింది. విశాఖపట్నం వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. 2 వికెట్ల తేడాతో కంగారూలపై విజయం సాధించింది. దీంతో 5 టీ20 మ్యాచ్‌ల సరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫస్ట్‌ టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సూర్యాసేన గెలుపొందింది. టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి.. 208 పరుగులు చేశారు. జోస్‌ ఇంగ్లిస్‌ 110 పరుగులతో చెలరేగి ఆడగా.. ఓపెనర్లు స్మిత్‌ 52 పరుగులు, మాథ్యూ 13 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత టిమ్‌ డేవిడ్‌ 19, స్టోయినిస్‌ 7 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ప్రసిధ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.

ఆసీస్‌ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సూర్యా సేన 19.5 ఓవర్లలో ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 42 బంతుల్లో 80 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ 39 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. ఓపెనర్‌ యశ్వస్వి జైస్వాల్‌ 21 పరుగులు చేయగా.. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్, అర్షదీప్‌ డైమండ్‌ డకౌట్‌ అయ్యారు. తిలక్‌ వర్మ 12 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రింకూ సింగ్‌ 14 బంతుల్లో 22 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక.. ఆసీస్‌ బౌలర్లలో తన్‌వీర్‌ సంఘా రెండు వికెట్లు తీయగా.. జేసన్, మ్యాట్‌ షార్ట్‌, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్‌.

Tags:    

Similar News