IND vs NZ Final: ఆ ఇద్దరు ఇండియన్ బ్యాటర్ల రికార్డు అదుర్స్.. ఇక న్యూజిలాండ్‌కు డబిడదిబిడే!
IND vs NZ Final: టీ20 ఫార్మాట్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో టీమిండియా 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. కివీస్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ విజయాల్లో భారత బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు.
IND vs NZ Final: ఆ ఇద్దరు ఇండియన్ బ్యాటర్ల రికార్డు అదుర్స్.. ఇక న్యూజిలాండ్‌కు డబిడదిబిడే!
IND vs NZ Final: డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కీలక పోరు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో టీమిండియా 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. కివీస్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ విజయాల్లో భారత బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత టాప్-5 బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Suryakumar Yadav
ప్రస్తుతం భారత కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా ఉన్నాడు. బ్లాక్ క్యాప్స్‌పై 13 మ్యాచ్‌లు ఆడిన సూర్య .. 526 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. సూర్య సగటు 58.44గా ఉండడం విశేషం.
Rohit Sharma:
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా న్యూజిలాండ్‌పై అద్భుత రికార్డు కలిగి ఉన్నాడు. హిట్ మ్యాన్ 17 మ్యాచ్‌ల్లో 511 పరుగులు చేశాడు. కివీస్ మ్యాచ్‌ల్లో ఆరు అర్ధ శతకాలు సాధించి జట్టుకు కీలక విజయాలు అందించాడు.
KL Rahul:
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా న్యూజిలాండ్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 322 పరుగులు చేసి మూడు అర్ధ శతకాలు సాధించాడు. తక్కువ మ్యాచ్‌ల్లోనే భారీ స్కోర్లు చేయడం రాహుల్ ప్రత్యేకత.
Ishan Kishan:
టీ20 వరల్డ్ కప్ 2026లో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కిషన్ 11 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేయగా.. అతడి సగటు 28.90గా ఉంది.
Virat Kohli:
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
Suryakumar-Kishan:
పై లిస్టులో నేడు ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆడనున్నారు. ఈ ఇద్దరు చెలరేగితే న్యూజిలాండ్‌కు డబిడదిబిడే అనే చెప్పాలి. ఇద్దరు భారీ సిక్సులు బాదుతారన్న విషయం తెలిసిందే. టోర్నీలో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో కూడా వీరి ప్రదర్శనపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. టీమిండియా బ్యాటింగ్ బలంతో మరోసారి ట్రోఫీని గెలుస్తుందా అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.