IND VS NZ Playing 11: టీమిండియాదే ముందుగా బ్యాటింగ్.. ఆ ఇద్దరు ఫ్లాప్ స్టార్లకు తుది జట్టులో చోటు!
IND vs NZ Final 2026 Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
IND VS NZ Playing 11: టీమిండియాదే ముందుగా బ్యాటింగ్.. ఆ ఇద్దరు ఫ్లాప్ స్టార్లకు తుది జట్టులో చోటు!
IND vs NZ Final 2026 Playing XI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ట్రోఫీ కోసం తీవ్రంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి.
అభిషేక్, వరుణ్ ఆడుతున్నారు:
న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన మెక్‌కాంచి స్థానంలో డఫీకి అవకాశం ఇచ్చింది. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇద్దరు ఫ్లాప్ స్టార్స్ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు టీమిండియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతాడని వార్తలు రాగా.. ఫైనల్ కాబట్టి మిస్టరీ స్పిన్నర్ పైనే కెప్టెన్, కోచ్ నమ్మకం ఉంచారు.
లక్ష మందికిపైగా అభిమానులు:
భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు లక్ష మందికిపైగా అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ స్టేడియంలో అభిమానుల సందడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. భారత్ మరోసారి టైటిల్ గెలుస్తుందా? లేక న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
తుది జట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.