టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల .. భారత్‌తో తలపడే జట్లు ఇవే...

టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో 2020 ప్రపంచకప్‌ షెడ్యూల్ ఐసీసీ విడుదల చేసింది

Update: 2019-11-04 13:29 GMT
T20 World Cup

 టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో 2020 ప్రపంచకప్‌ షెడ్యూల్ ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నిలో మొత్తం 16 దేశాలు తలపడనున్నాయి. టోర్నీలో పసికూనలు కూడా ఉండడంతో షెడ్యూల్‌ పకడ్భందీగా రూపొందించింది. నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, పపువా న్యూగినియా పసికూనలు తమ అదృష్టాన్ని పరీక్షీంచుకోబోతున్నాయి. చిన్న జట్లు ఆడే మ్యాచ్‌ల పట్టికను ఏ, బి గ్రూపులుగా విభజించింది. చిన్న జట్లతోపాటు ఐసీసీ అందులో రెండు పెద్ద జట్లు గ్రూపుల్లో ఉండనున్నాయి. రెండు గ్రూపుల్లో విజయం సాధించిన 12 జట్లు సూపర్ సూపర్-12కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్-ఎ:

శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లండ్‌, ఒమన్‌

గ్రూప్-బి :

బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌

సూపర్ -12 దశలో జట్లను గ్రూప్ 1, గ్రూపు2గా ఐసీసీ విభజించింది.

గ్రూప్ 1 :

పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్

గ్రూప్ 2 :

భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్

గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అలాగే గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన జట్లు సూపర్ -12లోని గ్రూప్ 1లో చేరతాయి. గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉన్న జట్టు, గ్రూప్ఏ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ 12లోని గ్రూప్-2లో చేరుతుంది.

శ్రీలంక-ఐర్లండ్ మధ్య అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నవంబరు 15న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా జట్టు 5 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో, 29న 'ఎ2'విజయతతో, నవంబరు1న ఇంగ్లండ్‌తో, నవంబరు 5న 'బి1' విజేతతో, నవంబరు 8న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Tags:    

Similar News