ICC T20 World Cup : కాసేపట్లో శ్రీలకంతో పోరు.. హర్మన్‌సేనకు చక్కటి అవకాశం

కాసేపట్లో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ శ్రీలంకతో తలపడనుంది.

Update: 2020-02-29 02:17 GMT
India File Photo

కాసేపట్లో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ శ్రీలంకతో తలపడనుంది. ఈటోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ శ్రీలంక మ్యాచ్ చక్కటి అవకాశం లభించింది. నామమాత్రమైన మ్యాచ్ కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్ లో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. లోపాలు సరి చేసుకోవడానికి మంచి అవకాశం. ఓపెనర్‌ స్మృతి మంధాన వరుస మ్యాచ్ ల్లో తేలిపోయింది. ఖ్యంగా టీ20ల్లో చెలరేగిపోయే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ వరస మ్యాచ్ ల్లో నిరాశపరిచింది. జెమీమా రోడ్రిగ్జ్‌ రెండో మ్యాచ్ లో పర్వాలేదనిపించిన మొదటి మ్యాచ్, మూడో మ్యాచ్ లో విఫలమైంది.

టాప్‌ఆర్డర్‌లో ఓపెనర్ షెఫాలీ వర్మ విఫలమైతే మంచి హర్మన్‌, స్మృతి పేలవ ఫామ్‌ టీమిండియాను కలవర పెడుతుంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల్లో 8 పైన రన్‌రేట్‌ కొనసాగించిన భారత్ చివరి ఓవర్లలో తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌలర్లు రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. సెమీస్‌లో ఛేదన చేయాల్సి వస్తే షెఫాలీ వర్మపైనే భారం పడుతోంది. ఆమె విఫలమైతే పరిస్థితి ఏంటి అనేదానిపైనే భారత్ మేనేజ్ మెంట్ ను వేధిస్తున్న ప్రశ్న.

బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో టీమిండియా మెరుగ్గానే ఉంది. కానీ, బౌలింగ్ భారం అంతా లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌పైనే పడుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌పై పూనమ్‌ యాదవ్‌ సత్తాచాటింది . అరుంధతిరెడ్డి, శిఖా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌, రాధా యాదవ్‌ల నుంచి పూనమ్ యాదవ్ కు కాస్త సహకారం అందుతోంది. ఈ లెగ్‌ స్పిన్నర్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఒకే వికెట్‌ తీసిన పూనమ్‌ పరుగులు కూడా బాగానే సమర్పించుకుంది. ఆఖరి ఓవర్లో ఏకంగా 18 పరుగులు ఇచ్చింది. ఆ తర్వాత శిఖా పాండే కట్టడి భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యేదే.

శ్రీలంక జట్టును భారత్ తక్కువ అంచనా వేయకుడదు. పసికూన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. హర్మన్‌ సేన శ్రీలంక ఆఖరి మ్యాచ్‌ తేలిగ్గా తీసుకుంటే ఫలితం మరోలా ఉంటుంది. ఈ మ్యాచ్ లోగాని ఓడితే భారత్ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే భారత్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.  

Tags:    

Similar News