టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల (ఫైల్ ఫోటో)
ICC World Cup 2021: క్రికెట్ అభిమానులకు ఐసిసి శుభవార్త తెలిపింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2021 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ రెండో దశ యూఏఈ మరియు ఒమన్ లో పూర్తయిన వెంటనే అక్కడే ఐసీసీ వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ఇక తొలి టీ-20 మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ మొదలుకానుంది.
అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్, నవంబర్ 14 న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జట్టు జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ ఆయా దేశాల క్రికెట్ సంఘాలకు తెలిపింది.
T20 World Cup 2021 Schedule
T20 World Cup 2021 Schedule