అతన్నిఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పాలి : హర్భజన్ సింగ్

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధ్వజమెత్తారు.

Update: 2019-12-24 17:15 GMT
Harbhajan singh File Photo

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధ్వజమెత్తారు. శ్రీలంక మూడు టీ20లు, ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, సిరీస్‌కు టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ని ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పాలని ప్రశ్నించాడు.

ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ ట్విట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ చేసిన తప్పేంటని, ఇండియా ఏ, ఇండియా బీ, భారత్ జట్టుకు ఎంపికైయ్యే ఆటగాళ్లలానే బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. విభిన్న ఫార్మాట్లకు ఆటగాళ్లకు వేర్వేరు నియమాలు ఎందుకు అని ట్విటర్లో ప్రశ్నించాడు.

ఇప్పటి వరకూ 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 4,920 పరుగులు నమోదు చేశాడు. 43.53 సగటు ఉంది. 73 మ్యాచుల్లో 13 సెంచరీలు, 24 ఆర్థశతకాలు ఉన్నాయి. 149 టీ20 మ్యా్చ్‌ల్లో 31.37 సగటుతో మూడు వేల పరుగులు సాధించాడు. ఇటీవలే జరిగిన బరోడాతో రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున ఆడిన సూర్యకుమార్ సెంచరీతో విరుచుపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై 309 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ లో 85 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 1,548 పరుగులు సాధించాడు. ఇందులో 7హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

శ్రీలంకతో జనవరి 5నుంచి 10 వరకు టీ20 సిరిస్‌ ప్రారంభం కానుంది. శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరీస్ రెండు జట్లు ఆడనున్నాయి. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌ జరగనుంది. ఆస్ట్రేలియాతో జనవరి 14 నుంచి 19 వరకు మూడు వన్డేల సిరిస్ జరుగుతుంది.

శ్రీలంక టీ20 సిరీస్ భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కె.ఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీద్ బుమ్రా, మనీష్ పాండే, నవదీప్ షైనీ, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, ఠాకూర్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్.




 

Tags:    

Similar News