IPL 2023: బెంగళూరుని ఇంటికి సాగనంపిన గుజరాత్.. ప్లేఆఫ్స్‌కు ముంబయి

IPL 2023: బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ ఆశలను దూరం చేసిన గుజరాత్

Update: 2023-05-22 03:00 GMT

IPL 2023: బెంగళూరుని ఇంటికి సాగనంపిన గుజరాత్.. ప్లేఆఫ్స్‌కు ముంబయి

IPL 2023: ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయభేరి మోగించింది. రాయల్ ఛాలెంజర్స్‌ ఫ్లే ఆఫ‌ ఆశలను దూరం చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ... శుభ్ మన్ గిల్ సంచలన ఇన్నింగ్స్ తో గుజరాత్‌ ను విజయతీరం చేర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలైనప్పటికీ... విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు టాపర్ గా నిలిచారు. ఇవాళ చేసిన సెంచరీతో 7 సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో 639 పరుగులతోమూడో స్థానంలో నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది. ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ 10 విజయాలతో పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 17 పాయింట్లతో చెన్నైసూపర్ కింగ్స్ రెండో స్థానం, 17 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్, 16 పాయింట్లతో ముంబై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకున్నాయి.

ఈనెల 23 తేదీన క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి. 24 తేదీన ఎలిమినేటర్ కోసం నిర్వహించే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ నాలుగు జట్ల క్వాలిఫయర్, ఎలిమినేటర్ దశలను దాటుకున్న జట్లు మే 28 తేదీన అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో తలపడబోతున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు మళ్లీ రెండో సారి వరుసగా టైటిల్ దక్కించుకునే విధంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News