India vs West Indies : కొత్త రూల్ ఇదే

వెస్టిండీస్ టీమిండియాల మధ్య శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానునుంది.

Update: 2019-12-05 16:23 GMT
West Indies Vs India File photo

 వెస్టిండీస్ టీమిండియాల మధ్య శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానునుంది. ఈ సిరీస్‌లో తొలి టీ20 హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరనుంది. కాగా.. ఈ మ్యాచ్ లో నూతన రూల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బౌలర్లు విసిరే నోబాల్స్ గుర్తించడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను ‎విషయంలో అనుమానం ఉంటే థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మ్యాచ్ లో నోబాల్స్ వేస్తే థర్డ్‌ అంపైర్‌ దానిని గుర్తించి ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్స్‌ను థర్డ్‌అంపైర్‌తో చర్చించిన తర్వాతే ప్రకటించాలి. బ్యాట్స్‌మన్‌ ఔటైన నోబాల్‌ బంతిని థర్డ్‌ అంపైర్‌ నిర్ణయిస్తే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్ అంపైర్ కు ఉండే అన్ని నిబంధనలు కొనసాగుతాయి.

అంతర్జాతీయ క్రికెట్‌లో నో బాల్స్‌ అంశంలో అనేక వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో 21 నోబాల్స్ ఫిల్డ్ అంపైర్ గుర్తించ లేకపోయారు. ఫీల్డ్ అంపైర్‌కు నోబాల్‌, ఎల్బీడబ్ల్యూ వంటివి గుర్తించడం సమస్యగా మారింది. దీంతో ఈ బాధ్యతలు థర్డ్ అంపైర్ నిర్వర్తించనున్నారు. టీమిండియా వెస్టిండీస్ మ్యాచ్ లో నిర్వహించే ఈ ట్రైయిల్స్ విజయవంతం అయితే భవిష్యత్‌లో ఈ బాధ్యతను థర్డ్ అంపైర్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం జరనున్న తొలి టీ20కి రెండు జట్లు తమ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. కాగా.. పిచ్ మాత్రం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. తొలుత టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే భారత్ సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భారత్ ప్రయోగాత్మక మార్పులు చేయనుంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు.  

Tags:    

Similar News