IND vs ENG, 2nd T20I: ఇంగ్లాండ్ టీంలో కీలక మార్పు.. స్టార్ ప్లేయర్ తొలగింపు..!

IND vs ENG, 2nd T20I: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోల్‌కతాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Update: 2025-01-25 04:00 GMT

IND vs ENG, 2nd T20I: ఇంగ్లాండ్ టీంలో కీలక మార్పు.. స్టార్ ప్లేయర్ తొలగింపు..!

IND vs ENG, 2nd T20I: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోల్‌కతాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సిరీస్‌లో తిరిగి నిలబడేందుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది. రిపోర్టుల ప్రకారం, రెండవ టీ20 మ్యాచ్‌లో గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్స్‌ను, జాకబ్ బెథెల్ స్థానంలో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

గస్ అట్కిన్సన్, తొలి మ్యాచ్‌లో రెండు ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి మ్యాచ్ కోసం తనదైన కృషి చేయలేకపోయాడు. అదేవిధంగా, జాకబ్ బెథెల్ 14 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతను ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కాబట్టి అతని స్థానంలో జేమీ స్మిత్‌ను తీసుకునే అవకాశం ఉంది.

కోల్‌కతా టీ20లో ఇంగ్లాండ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆటగాళ్లు ఆశించిన విధంగా ప్రదర్శన చేయలేకపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ మినహా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ మాత్రమే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు..అయితే ఇతర బౌలర్లు మాత్రం ఎక్కువ పరుగులు ఇచ్చారు.

రెండవ టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మార్పులతో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్:

మొదటి మ్యాచ్: జనవరి 22, కోల్‌కతా

రెండవ మ్యాచ్: జనవరి 25, చెన్నై

మూడవ మ్యాచ్: జనవరి 28, రాజ్‌కోట్

నాలుగవ మ్యాచ్: జనవరి 31, పూణే

ఐదవ మ్యాచ్: ఫిబ్రవరి 2, ముంబై

Tags:    

Similar News