3rd T20: బట్లర్ బాదేశాడు: మూడో టీ20లో ఇంగ్లాండ్‌ దే గెలుపు

3rd T20: బట్లర్ బాదేశాడు: మూడో టీ20లో ఇంగ్లాండ్‌ దే గెలుపు
x
Highlights

3rd T20: మూడో టీ20లో ఇండియాపై ఇంగ్లాండ్ టీం గెలుపొందింది. ఇండియా టీం కెప్టెన్ విరాట్ వన్ మ్యాన్ షో వ్యర్థమైంది.

India vs Engalnd 3rd T20: మూడో టీ20లో ఇండియాపై ఇంగ్లాండ్ టీం 8వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండియా టీంలో విరాట్ వన్ మ్యాన్ షో వ్యర్థమైంది. ఇంగ్లాండ్ టీం లోనే బట్లర్ (83 పరుగులు, 52 బంతులు, 5ఫోర్లు, 4 సిక్సులు) వన్ మ్యాన్ షో తో మ్యాచ్ ను తమ వైపు లాగేశాడు. అతడికి తోడుగా బెయిర్‌స్ట్రో (40 పరుగులు, 28 బంతులు, 4 ఫోర్లు) అండగా నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ 100వ మ్యాచ్ ను విజయంతో ముగించాడు. 5 టీ20 ల సిరీస్ లో ఇంగ్లాండ్ టీం 2 -1 తేడాతో ముందుంది.

భారత్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ధాటిగానే ప్రారంభించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాన్సన్ రాయ్, జాస్ బట్లర్ భారత బౌలర్లపై విరుచుకపడేలా బౌండరీలు సాధించారు. కానీ, ఇంతలో చాహల్ తెలివిగా బౌల్ చేసి జాన్సన్ రాయ్ (9పరుగులు, 13 బంతులు, 2 ఫోర్లు) ను పెవిలియన్ కు చేర్చాడు. తొలి వికెట్ తీసిన ఆనందం భారత్ కు ఎక్కువసేపు నిలవనివ్వలేదు బట్లర్. ప్రతీ ఓవర్లో సిక్సులు, ఫోర్లు బాదుతూ..భారత బౌలర్లపై ప్రెజర్ పెంచేశాడు. కేవలం 26 బంతుల్లోనే హాప్ సెంచరీతో చెలరేగిపోయాడు. మలాన్ (18 పరుగులు, 17 బంతులు, 1 సిక్స్) ను వాషింగ్ టన్ సుందర్ దొరకబుచ్చుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. కానీ, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్‌ కోహ్లీ (77; 46 బంతుల్లో 8×4, 4×6) మోత మోగించాడు. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. వరుసగా రెండో అర్ధశతకం చేశాడు. దాంతో 20 ఓవర్లకు భారత్‌ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (25; 20 బంతుల్లో 3×4) కాసేపు అలరించాడు. హార్దిక్‌ (17; 15 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించాడు. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. మార్క్‌వుడ్‌ (3/31) చురకత్తుల్లాంటి బంతులకు రాహుల్‌ (0), ఇషాన్‌ కిషన్ (4)‌, రోహిత్‌ (15) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories