అరటిపండు తొక్క తీసివ్వమన్న ఆటగాడు.. ఆమె నీ పనిమనిషి కాదంటూ అంపైర్ వార్నింగ్!

జనవరి 20 నుంచి తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రాంరభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో కీలక ప్లేయర్లు అందరు ఆడుతున్నారు.

Update: 2020-01-23 09:21 GMT

జనవరి 20 నుంచి తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రాంరభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో కీలక ప్లేయర్లు అందరు ఆడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా మ్యాచ్ విరామ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెల్ బోర్న్ జరిగిన ఓ మ్యాచ్ విరామ సమయంలో ఫ్రెంచ్‌ ఆటగాడు ఇలియట్‌ బ్రెంచెట్రిట్‌కు ఆరటిపండు తీసుకొచ్చింది. దీంతో అరటిపండు తొక్క తీసిస్తావా అని ఫ్రెంచ్‌ ఆటగాడు ఇలియట్‌ బ్రెంచెట్రిట్‌ అడిగాడు. ఇది విన్న చైర్ అంపైర్ బ్రెంచెట్రిట్‌కు చివాట్లు పెట్టాడు.

బ్రెంచెట్రిట్‌పై చైర్‌ అంపైర్‌ జాన్‌ బ్లోమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రెంచెట్రిట్ కనీసం అరటిపండు తొలు కూడా తీసుకోలేకపోతున్నావా అని చివాట్లు పెట్డారు. వెంటనే అరటి పండు అతని చేతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లాలని బాల్ గళ్ ను సూచించాడు. దీంతో ఇలియట్‌ బ్రెంచెట్రిట్‌కు బాల్ గళ్ ఆరటిపండు ఇచ్చింది. బ్రెంచెట్రిట్‌ దాని తోలుతీసుకుని ఆరగించాడు. అనంతరం చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. తన చేతికి లోషన్ రాసుకున్నానని అందుకే తోలు తీసి అరటిపండు ఇవ్వాలని అడిగానని ఇలియట్ అంపైర్ కు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాల వైరల్ అయింది. అంతే కాదు వ్యక్తిగత అవసరాలకు బాల్ గళ్ ను ఉపయోగించుకోవడాని ఆమె పని మనిషి కాదని నెటిజన్లు సెటైర్లు వేశారు.

జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7 వరకు తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్ బోర్న్ పార్క్‌లో జరగనుంది. అస్ట్రేలియన్ ఓపెన్ రికార్డు వర్షానికి, ఎండకు ఇబ్బంది కలుగకుండా పై కప్పుతో కూడిన మైదానాలు ఈ టోర్నీలో ప్రత్యేకత ఆకర్షణ. ఇక్కడ రాడ్ లీవర్ ఎరీనా, మార్గరెట్ ఎరీనా, హైసెన్స్ ఎరీనా, మూడు కోర్టులు కూడా ఉన్నాయి. టాప్‌-50 ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. స్పెయిన్ ఆటగాడు రఫెల్‌ నాదల్‌, మహిళల్లో అగ్రస్థానంలో ఆష్లే బార్టీ ఈ టోర్నిలో ఆడనున్నారు.  


  

Tags:    

Similar News