దినేష్ కార్తీక్ స్టన్నింగ్ క్యాచ్.. చూడాల్సిందే

భారత జట్టు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరోసారి తన ఫీల్డింగ్‌తో మెరిపించాడు. దేవధార్‌ ట్రోఫీలో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో అదిరిపోయే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.

Update: 2019-11-04 15:56 GMT
Dinesh Karthik

భారత జట్టు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరోసారి తన ఫీల్డింగ్‌తో మెరిపించాడు. దేవధార్‌ ట్రోఫీలో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో అదిరిపోయే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ లో ఇండియా -సి తరఫున అడుతున్న అతడు ఇండియా‌-బి ఆటగాడు పార్థీవ్‌ పటేల్‌ బ్యాట్‌ అంచుకు తగిలి ఆఫ్‌ సైడ్‌ నుంచి వచ్చిన బంతిని దినేశ్‌ కార్తీక్‌ గాల్లో డైవ్‌ కొట్టి మరి క్యాచ్ పట్టుకున్నాడు. దినేశ్‌ కార్తీప్‌పై సోషల్‌ మీడియలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్‌-బి 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. కేదార్‌ జాదవ్‌(86) యశస్వి జైస్వాల్‌(54), అర్ధ శాతకాలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు చేసిన భారత్‌-సి మొదట్లోనే వికెట్ వికెట్‌ను కోల్పోయింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులకే చేసింది. దీంతో 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ ఒక పరుగు చేసి నిరాశపరిచాడు.

ఈ సిరీస్ లో కోహ్లీ రికార్డును శుభ్ మన్ గిల్ బద్దలు కొట్టాడు. దేవధార్‌ ట్రోఫీలో కోహ్లి 21 ఏళ్ల 142 రోజుల వయసులో జట్టుకు కెప్టెన్ గా చేశాడు. శుభ్‌మన్‌ 20 ఏళ్ల 50 రోజుల వయసులో కెప్టెన్ గా చేసి కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు.



Tags:    

Similar News