ఆటాడుతూనే..వార్నర్ 'బుట్టబొమ్మ' స్టెప్పులు.. అభిమానులు ఫిదా!

వార్నర్-బుట్టబొమ్మ పాట..ఇది విడదీయలేని బంధం! వార్నర్ డ్యాన్స్ కు అభిమానుల సంబరం

Update: 2020-11-27 16:48 GMT

David Warner Buttabomma Dance in Field (img src: Twitter video)

సోషల్ మీడియా ప్రపంచాన్ని చిన్నది చేయడమే కాదు.. మన తెలుగు సినిమా పాటలోని పవర్..ద్యన్సుల్లోని గ్రేస్ ప్రపంచ వ్యాప్తంగా మరోమెట్టు పైకి ఎక్కించింది.మన హీరోల స్తేప్పులకు ఫిదా అయిపోతున్న పలువురు సెలబ్రిటీలు ఆ పాటల స్టెప్పులు తామూ వేసి వీడియోలు తీసి ప్రపంచంతో పంచుకుంటున్నారు. 

బన్నీ..త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా పాటలు ఒక రేంజిలో హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలోని బుట్ట బొమ్మ పాట అయితే.. ఆడియో ఎంత హిట్ అయిందో దానిని మించి బన్నీ..పూజా హేగ్దెల స్టెప్పులు హిట్ అయ్యాయి. ఆ ఒక్క పాటే యుట్యూబ్ లో 450 మిలియన్ల వ్యూస్ తొ రికార్డు సృష్టించింది. ఇక ఈ పాట టిక్ టాక్ లో అయితే ఎంత క్రేజీ పాటో చెప్పక్కర్లేదు. 

ఇప్పుడిదంతా ఎందుకంటే.. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు పెర్త్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఓపెనర్ గా అదరగొట్టేశాడు. ఇక ఫీల్డింగ్ లో బౌండరీ లైన్ దగ్గర ఉన్నపుడు మనోడు బుట్ట బొమ్మ పాట స్టెప్పులు వేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న వార్నర్ తెలుగు పాటలంటే చాలా ఇష్టపడతాడు. ఈ బుట్ట బొమ్మ పాటకి వీరాభిమాని. తను ఈ పాటను తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అదేవిధంగా ఈ పాత ౪౫౦ మిలియన్ల రికార్డ్ రీచ్ అయినపుడు బన్నీకి శుభాకాంక్షల సందేశామూ పంపించాడు. 

ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నా సందర్భంలోనూ తన అభిమాన పాటను హం చేస్తూ స్టెప్పులు వేసిన వార్నర్ ను అభిమానులు వీడియోలు తీశారు. ఈ వీడియోలు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయాయి. ''ప్లేస్ మారిందంతే.. బుట్టబొమ్మ మీద ప్రేమ మారలేద''ని సన్ రైజర్స్ ట్వీట్ చేసింది. ఇక బన్నీ..వార్నర్ అభిమానులైతే ఈ వీడియోను షేర్ చేస్తూ విపరీతంగా సంబరపడిపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో ఇదిగో మీరూ చూడండి వార్నర్ డ్యాన్స్..


Tags:    

Similar News