Vaibhav Suryavanshi: రాష్ట్రపతి చేతుల మీదుగా 'బాల పురస్కారం' అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నయా సంచలనం, 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని అత్యున్నత పౌర పురస్కారం వరించింది.

Update: 2025-12-26 06:56 GMT

Vaibhav Suryavanshi: రాష్ట్రపతి చేతుల మీదుగా 'బాల పురస్కారం' అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నయా సంచలనం, 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని అత్యున్నత పౌర పురస్కారం వరించింది. క్రీడారంగంలో అతను కనబరుస్తున్న అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2025' ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వర్ణరంజిత వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును స్వీకరించాడు.

వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అడుగుపెట్టిన ఆటగాడిగా (రాజస్థాన్ రాయల్స్ తరపున) కూడా చరిత్రకెక్కాడు.

అవార్డు ప్రధానోత్సవం అనంతరం వైభవ్ ఇతర పురస్కార గ్రహీతలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోనున్నారు. ఈ గౌరవం పట్ల క్రీడా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. త్వరలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. దేశం గర్వించేలా చేస్తున్న ఈ చిరుత ప్రయాణం ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Tags:    

Similar News