ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్‌గా ధోని, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీ ఎంపిక
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ) ఈ దశాబ్దపు తమ కలల వన్డే జట్టు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేసింది.
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనితో సహా మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా చోటు కల్పించిన మరో భారత ఆటగాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నారు. కాగా, వన్డే జట్టులో కేవలం ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్‌కు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా చోటు కల్పించడం విశేషం . ఈ జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు మిపహా మరే జట్టుకు చోటు కల్పించకపోవడం గమనార్హం .
ఇక ఈ వన్డే జట్టులో సౌతాఫ్రికా క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హాసన్, న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్డ్, ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్, శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా, ఆష్గానిస్తాన్ నుంచి స్పిన్నర్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు చోటు ఇచ్చింది. టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ, వన్డే మ్యాచ్‌లకు ధోనినీ కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇక టెస్టు జట్టకు భారత నుంచి కోహ్లీని మాత్రమే ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా నుంచి వార్నర్, స్టీవ్ స్మీత్ , నాథన్ లయన్ ను ఎపింక చేసింది. ఇంగ్లాండ్ నుంచి కుక్, స్టోక్స్ , స్గువర్డ్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ను ఎంపిక చేసింది. దక్షిణాఫ‌్రికా నుంచి డివిలియర్స్ , స్టెయిన్ ఎంపిక చేసింది.
దశాబ్దపు క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టు
మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్-వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హషీమ్ ఆమ్లా, జోస్ బట్లర్, షకీబుల్ హసన్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగా.
దశాబ్దపు క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), అలెస్టర్ కుక్( ఇంగ్లాండ్ ), డేవిడ్ వార్నర్( ఆస్టేలియా) , కేన్ విలియమ్సన్( నూజిలాండ్ ), స్టీవ్ స్మిత్( ఆస్టేలియా), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్) బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్), డేల్ స్టెయిన్(సౌతాఫ్రికా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), నాథన్ లయన్ ( ఆస్టేలియా), జేమ్స్ అండర్సన్.