కరోనా ఎఫెక్ట్ : ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ వాయిదా..

ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ నవంబర్‌లో భారతదేశంలో జరగాల్సి ఉంది. అయితే COVID -19 మహమ్మారి తీవ్రతరం కారణంగా ఇది వాయిదా పడింది.

Update: 2020-04-04 06:37 GMT
Representational Image

ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ నవంబర్‌లో భారతదేశంలో జరగాల్సి ఉంది. అయితే COVID -19 మహమ్మారి తీవ్రతరం కారణంగా ఇది వాయిదా పడింది. ఈ మేరకు ఫుట్‌బాల్ ప్రపంచ పాలక మండలి శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2020-21 వరకు దేశంలోని ఐదు వేదికలలో మహిళల ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. అంతేకాదు వర్కింగ్ గ్రూప్ "ఫిఫా అండర్ -20 మహిళల ప్రపంచ కప పనామా / కోస్టా రికా 2020 ను కూడా వాయిదా వేయాలని నిర్ణయించింది - మొదట ఈ దీనిని ఆగస్టు / సెప్టెంబర్ 2020 న షెడ్యూల్ చేయబడింది.. అలాగే ఫిఫా అండర్ -17 ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా 2020 - మొదట నవంబర్ 2020 న షెడ్యూల్ చేయబడింది.

ఇక వర్కింగ్ గ్రూపులో ఫిఫా పరిపాలన మరియు సెక్రటరీ జనరల్స్ అలాగే అన్ని సమాఖ్యల నుండి ఉన్నతాధికారులు ఉన్నారు. శుక్రవారం నిర్వహించిన మొదటి సమావేశం తరువాత వివిధ దేశాలు చేసినసిఫారసుల శ్రేణిని వర్కింగ్ గ్రూపు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో వాయిదా నిర్ణయం తీసుకుంది. కాగా ఇక రీషెడ్యూల్ తేదీలను తరువాత ప్రకటించనుంది. ఇటీవల ఫిఫా-కాన్ఫెడరేషన్ వర్కింగ్ గ్రూప్ ఈనిర్ణయం తీసుకుంది. ఐదు నెలల దూరంలో ఉన్న ఈ టోర్నమెంట్‌కు ఇప్పటివరకు కొన్ని క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లు జరిగాయి.. మిగిలినవి ప్రపంచ ఆరోగ్య సంక్షోభం కారణంగా జరగలేదు.


Tags:    

Similar News