పుజారాపై టీమిండియా క్రికెటర్లు పంచులు
భారత క్రికెట్ జట్టు టెస్టు బ్యాట్స్‌మెన్ మిస్టర్ వాల్ చతేశ్వర పుజారాపై టీమిండియా ప్లేయర్లు వరుస పంచులు విసురుతున్నారు.
భారత క్రికెట్ జట్టు టెస్టు బ్యాట్స్‌మెన్ మిస్టర్ వాల్ చతేశ్వర పుజారాపై టీమిండియా ప్లేయర్లు వరుస పంచులు విసురుతున్నారు. టెస్టుల్లో మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన పుజారా.. తాజాగా బౌలర్ అవతారమెత్తాడు. రంజీ ట్రోఫిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో సౌరాష్ట్ర జట్టు తలపడింది. అయితే సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా భాద్యతలు నిర్వహిస్తున్న పుజారా ఈమ్యాచ్ లో బ్యాట్ తో కాకుండా బంతితో మెరిశాడు. ఉత్తరపద్రేశ్ జట్టు బ్యాట్స్‌మెన్ మోహిత్ జంగ్రాను పుజారా తన లిగ్ స్పీన్ డెలివరీతో ఔట్ చేశాడు. మోహిత్ వికెట్ తీసిన ఆనందంలో పుజారా మైదానం సంబరాలు చెసుకున్నాడు. దీంతో మ్యాచ్ లో పుజారా వికెట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. వికెట్ తీసిన ఆనందాన్ని మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అంతేకాకుండా దానికి ఓ క్యాప్షన్ ఇచ్చాడు . బ్యాట్స్‌మెన్ నుంచి ఆల్‌రౌండర్‌కు ఎదిగానని కామెంట్ పెట్టి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
అయితే చతేశ్వర పుజారా వికెట్ తీయడం పట్ల సహచర ఆటగాళ్లు అనందం వ్యక్తం చేశారు. ఇక పుజారా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్,ఆల్ రౌండర్, రైట్ హ్యండ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటపట్టించారు. అద్భుతంగా బౌలింగ్ చేశావు, నీ వేగానికి స్ర్పింటర్ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడు అంటూ ధావన్ కామెంట్ చేశాడు. నీ బౌలింగ్ అసాధారణం మరింత బౌలింగ్ చేసే సమయం ఆసన్నమైంది అంటూ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక దీనిపై నెటిజన్లు కూడా ఫన్ని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి తన పదేళ్ల కెరీర్‌లో వరకూ 75 టెస్టు మ్యాచ్ లు ఆడిన పుజారా 124 ఇన్నింగ్స్ లో 5740 పరుగులు చేశాడు. 18 సెంచరీలు, 24 అర్థ శతకాలు ఉన్నాయి. కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 197 మ్యాచులు ఆడి 15,188 పరుగులు 49 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు ఉన్నాయి, ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్ ట్రాక్ రికార్డు చాలా ఫూర్ గా ఉంది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలం పాటలో పుజారాకు నిరాశ ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ పుజారాను వేలంలో కొనుగోలు చేయాలేదు.