Chennai Test: టీమిండియా 337 ఆలౌట్..

Update: 2021-02-08 06:51 GMT

భారత ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ స్కోర్ 

చెన్నై టెస్ట్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 337 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆ స్కోరుకు 80 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను చేజార్చుకుంది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు మొదటి ఇన్నింగ్స్ లో 241 పరుగుల ఆధిక్యం లభించినట్టయింది.

ఏడో వికెట్‌కు వాషింగ్టన్‌ సుందర్‌ (85 నాటౌట్), రవిచంద్రన్‌ అశ్విన్‌(31) ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఈ జంటను జాక్‌ లీచ్‌ విడదీశాడు. అశ్విన్ ను ఔట్ చేసిన లీచ్ తరువాత కొద్దిసేపటికే నదీం (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత ఇషాంత్(4), బుమ్రా(0) లను అండర్సన్ అవుట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ 95.5 ఓవర్లకు ముగిసింది.

మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. తమ రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. అశ్విన్ తో బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన భారత్ ఫలితం దక్కింది. తోలి ఓవర్ మొదటి బంతికే అశ్విన్ వేసిన బంతి ఆడబోయిన ఇంగ్లండ్ ఓపెనర్ రోరీబర్స్ రహానే చేతికి చిక్కాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఖాతా తెరవకుండానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయినట్టయింది. లంచ్ విరామానికి ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కోల్పోయి ఒక్క పరుగుతో నిలిచింది. క్రీజులో సిబ్లీ, లారెన్స్‌ ఉన్నారు.

Tags:    

Similar News