Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఇది మార్చి 2న న్యూజిలాండ్‌తో జరుగుతుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఇది మార్చి 2న న్యూజిలాండ్‌తో జరుగుతుంది. దీని తర్వాత భారత జట్టు మార్చి 4న దుబాయ్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా భారత అభిమానులకు ఒక పెద్ద శుభవార్త అందిచాడు. తను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో బుమ్రా షేర్ చేశాడు. ఈ వీడియో వెలువడిన తర్వాత తను సెమీ-ఫైనల్స్‌కు ముందు టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడన్న ఊహాగానాలు వెలువడ్డాయి.
బుమ్రా టీం ఇండియాలోకి వస్తాడా?
వెన్నునొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. స్కాన్ నివేదికలు వెలువడిన తర్వాత.. అతడిని ఎన్ సీఏకు పంపారు. అక్కడ అతడు బీసీసీఐ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాడు. దాదాపు నెల రోజులుగా మైదానానికి దూరంగా ఉన్న బుమ్రా ఇప్పుడు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తను వీడియోలో మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించాడు. మార్చి 4న జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్‌లోకి తను ఎంట్రీ ఇవ్వడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచ్ కు ప్రస్తుతం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీసీసీఐ నుంచి కూడా అధికారిక సమాచారం రాలేదు. నివేదిక ప్రకారం.. మార్చి 22 నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్ లో ఆడే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా బుమ్రాకు నడుము భాగంలో కొంత సమస్య ఏర్పడింది. దీని కారణంగా అతను ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. బీసీసీఐ వైద్య బృందం అతనికి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి అతను ఫిట్‌గా ఉంటాడని ఆశించారు.. కానీ అది జరగలేదు. కాగా, జస్‌ప్రీత్ బుమ్రా స్కాన్ తర్వాత తనను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి రిలీవ్ చేశారు. బుమ్రా విషయంలో బోర్డు ఎలాంటి తొందరపాటు చూపించకూడదని స్పష్టంగా పేర్కొంది.
జస్‌ప్రీత్ బుమ్రా వీడియో చూసిన తర్వాత అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రాను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు బుమ్రా సెమీ-ఫైనల్స్ లో ఆడటం చూడాలని కోరుతున్నారు. మరికొందరు ఫైనల్స్ లో ఆడటం చూడాలని కోరుకుంటారు. ప్రస్తుతానికి అభిమానుల ఈ డిమాండ్ నెరవేరడం కష్టంగా కనిపిస్తోంది.