వైరల్ వీడియో : వినూత్నంగా సంబరాలు చేసుకున్న క్రికెటర్

ఆప్ఘానిస్థాన్ స్పిన్నర్‌ ఖైస్‌ అహ్మద్‌ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించాడు

Update: 2019-12-21 16:26 GMT
Big Bash League Qais ahmad

ఆప్ఘానిస్థాన్ స్పిన్నర్‌ ఖైస్‌ అహ్మద్‌ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఖైస్‌ అహ్మద్‌ వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్, సిడ్నీ సిక్సర్స్‌ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘానిస్థాన్ ప్లేయర్ ఖైస్‌ అహ్మద్‌ హోబర్ట్‌ హరికేన్స్ తరపున ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో సిడ్నీ‌సిక్సర్ బరిలోకి దిగిన బ్యాట్స్‌మన్‌ టామ్‌ కరన్‌, ఖైస్‌ అహ్మద్‌ వేసిన బంతిని అంచనా వేయడంతో విఫలమైయ్యాడు. దీంతో బంతి వికెట్లను తాకింది. టామ్‌ కరన్‌ను ఔట్ చేసిన సంతోషంలో ఖైస్‌ అహ్మద్‌ గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టాడు. ఖైస్‌ అహ్మద్‌ వినూత్నంగా సంబరాలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ లో హోబర్డ్‌ హరికేన్స్‌ ఘనవిజయం సాధించింది. ఆప్ఘన్ స్పిన్నర్ ఖైస్‌ అహ్మద్‌ బౌలింగ్ తో సిడ్నీ సిక్సర్స్‌ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. నాలు ఓవర్లు బౌలింగ్ వేసిన అహ్మద్ 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన హోబర్డ్‌ హరికేన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌ 104 పరుగులకే కుప్పకూలిపోయింది.



Tags:    

Similar News